నవ్వులెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడెప్పుడో జంధ్యాల రూపొందించిన ‘అహనా పెళ్లంట’ చిత్రంలో అరగుండు పాత్రలో నటించిన బ్రహ్మానందం ఆ తరువాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. పాత్రల మీద పాత్రలు నటించుకుంటూ వెళ్లాడు. అందులో హాస్యముందా లేదా అని ప్రేక్షకులు కూడా చూడలేదు. ఆయన ఎలా నటించినా తెలుగు ప్రేక్షకులు నవ్వుల పువ్వులను వెదజల్లారు. అయితే, ఇపుడు సీన్ మారింది. బ్రహ్మానందం నటించిన చిత్రాలలో ఒక్క నవ్వు కూడా ఉండటంలేదని సదరు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అందుకు తగ్గట్లే అతను నటించిన చిత్రాలు కూడా ఏ మాత్రం విజయాలను పొందలేకపోతున్నాయి. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తూ విసిగిస్తున్నాడని అక్కడక్కడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆయన నటించిన ఏ చిత్రంలో కూడా సరైన పాత్రలు పండలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రొటీన్ ఎక్స్‌ప్రెషన్‌లతో ఏడుపులతో పాత్రలను నెట్టుకురావడం ఇబ్బందికరమేనని చెబుతున్నారు. అయితే బ్రహ్మానందం తన పాత్ర ఎలా వుంది అని చూడకుండా ఒకటి రెండు రోజుల కాల్షీట్లనైనా ఇచ్చే ఆ సినిమాలో తానున్నాను అనిపిస్తున్నాడు. దీంతో ఆయన పాత్రలు ఏ చిత్రంలో కూడా సరైన పంథాలో సాగడంలేదు. పోసాని కృష్ణమురళి, పృధ్వీ ఆయన పాత్రలను చేయగలుగుతున్నారు. దానికితోడు ఎం.ఎస్.నారాయణ లేకపోవడంతో సరైన జోడీ కూడా బ్రహ్మానందానికి కుదరడంలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్రహ్మానందం హవా రావాలంటే రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ‘ఎలుకా మజాకా’ చిత్రం విడుదలైతే కానీ తెలియదు!