భావోద్వేగాల ప్రెజర్ కుక్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ విలువలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే సెటైరికల్ ఎంటర్‌టైనర్ -ప్రజెర్ కుక్కర్ అంటున్నారు దర్శకుడు సుజోయ్, సుశీల్. లైఫ్‌లో చూసిన కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో సినిమాను తెరకెక్కించామని అన్నారు. సాయిరోనక్, ప్రీతి అస్రాని జోడీగా నిర్మాత అప్పిరెడ్డితో కలిసి సుజోయ్, సుశీల్ నిర్మించిన చిత్రం 21న విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ -స్వదేశంలో ఉంటూ కూడా జీవితాన్ని గెలవమని చెప్పే చిత్రమిది. చదువులు, ర్యాంకుల పేరిట యూత్‌పై వత్తిడి పెరుగుతోంది. విద్యాభ్యాసం పూరె్తైన వెంటనే పిల్లన్ని విదేశాలకు పంపాలనే సంస్కృతి పెరిగింది. అలాంటి ఒత్తిళ్లతో నిరంతరం సతమతమయ్యే ఓ కుర్రాడు -ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు. తన కలల్ని వీడి మరో దారిలో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? అనే అంశాన్ని వినోదాత్మక రీతిలో సినిమాగా ఆవిష్కరించాం అన్నారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడితే, వృద్ధాప్యం వచ్చాక స్వదేశంలో తల్లిదండ్రులు ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కూడా సామాజిక సందేశాన్ని అంతర్లీనంగా చూపించామన్నారు. ప్రస్తతం తెలంగాణ నేపథ్య కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరుగుతున్నా -తాము మాత్రం ఆ ఫార్ములాను ఫాలో కాలేదన్నారు. తెలంగాణలోనే పుట్టిపెరిగామని, నిజ జీవితంలో అదే యాసతో మాట్లాడుతుంటామని, అందుకే తమకు తెలిసిన భాషలోనే సినిమా చేయాలన్న సంకల్పంతో తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నామన్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అనే భావన బలపడిందని, మంచి సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతోనే ‘ప్రెజర్ కుక్కర్’ తెరకెక్కించామన్నారు.