ఉత్కంఠ రేపుతున్న రాహు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృతిగార్గ్, అభిరామ్ వర్మ లీడ్‌రోల్స్‌లో డైరెక్టర్ సుబ్బు వేదుల తెరకెక్కించిన చిత్రం -రాహు. కాలకేయ ప్రభాగర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకున్న సినిమా 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవిత రాజశేఖర్, నిర్మాత రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ పాల్గొన్నారు. దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ -మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు కంపోజిషన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరో రెండు పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నాం. కొత్త కానె్సప్ట్‌తో వస్తోన్న రాహు అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాను అన్నారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ -రాహు మ్యూజిక్ సక్సెస్ మీట్‌కు రావడం హ్యాపీగా ఉంది. ఏమో ఏమో, క్షణిమ సాంగ్స్ చాలా బావున్నాయి. ఫిబ్రవరి 28న విడుదలవుతోన్న సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకముంది అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ -థ్రిల్లర్‌కు మంచి సీజన్ ఇది. ఈ టైంలో వస్తున్న రాహుకు సక్సెస్ గ్యారెంటీ. యంగ్ టీం కలిసి చేసిన ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నా అన్నారు. హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ -ఓ మంచి పాత్రకు నన్ను ఎంపిక చేసుకోవడం పట్ల దర్శకుడు సుబ్బుకి కృతజ్ఞతలు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ టీం చేస్తోన్న సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ -రాహు సినిమా ప్రోమోస్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. రాహు టైటిల్‌తోనే -డిఫరెంట్ కానె్సప్ట్‌తో వస్తోన్న సినిమా అన్నది అర్థమవుతోంది. దర్శకుడు సుబ్బు, టీంకి బెస్ట్ విషెస్ అన్నారు. నిర్మాత స్వామి మాట్లాడుతూ -కొత్తవాళ్లతో, అందరి సహకారంతో సినిమా పూర్తి చేశాం. కథ, సినిమా చేయడం, పబ్లిసిటీ అన్న మూడు మెట్లు దిగ్విజయంగా ఎక్కేశాం. విజయం అనే నాలుగో మెట్టుపై ప్రేక్షకులు మమ్మల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో అభిరామ్ మాట్లాడుతూ -తొలి సినిమా రాహుతోనే మ్యూజిక్ సక్సెస్ మీట్ నిర్వహించుకోవడం హ్యాపీగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తుందంటేనే -ఆ సినిమా స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరం ప్రాణం పెట్టి చేశాం. న్యూ ఏజ్ థ్రిల్లర్‌తో ఆడియన్స్‌లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయ అన్నాడు. ఈ చిత్రానికి సురేష్ రగుతు, ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ, సంగీతం సమకూర్చారు.