కింకర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ ఇప్పుడేం చేస్తోంది? అన్న ప్రశ్నకు -కెరీర్‌ను ఎంత డౌన్‌ఫాల్‌కు తీసుకెళ్లొచ్చో తీవ్రంగా ఆలోచిస్తోందంటూ సెటైర్లు వేస్తోంది ఇండస్ట్రీ. రకుల్ గురించి టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఎంతవేగంగా స్టార్ హీరోల సరసన చాన్స్‌లు అందుకుందో.. బాలీవుడ్‌కి వెళ్లాక అంతే వేగంగా అసలు అవకాశాలకే దూరమైపోయింది రకుల్. ఆమె చేతిలో ఇప్పుడు సినిమాలు లేవట. టాలీవుడ్‌లో రీ ఎంట్రీ కోసం ప్రత్యేక పాటలకు సిద్ధమవుతున్నా -పట్టించుకునే వాళ్లే లేరన్న మాట వినిపిస్తోంది. గత ఏడాది నాగార్జునతో చేసిన మన్మధుడు-2 తర్వాత రకుల్‌కు టాలీవుడ్‌లో ఒక్క సినిమా పడలేదు. సీనియర్ హీరోలతో జోడీ కట్టి తాను పొరబాటు చేస్తే, ఐరెన్ లెగ్ కారణంగా సినిమా ఫ్లాపులొచ్చాయంటూ మరో ముద్ర వేస్తున్నారంటూ వాపోతోందట. రాశిఖన్నా, సాయిపల్లవిలాంటి జూనియర్లు తనను దాటెళ్లిపోవడంతో, కింకర్తవ్యాన్ని రకుల్ తీవ్రంగా ఆలోచిస్తోందని అంటున్నారు. కోలీవుడ్, బాలీవుడ్‌లో చెప్పుకోతగని సినిమాలు చేతిలో లేకపోలేదు. కాకపోతే -శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఇండియన్-2 అయినా తన ఫేట్ మారుస్తుందేమోనని ఆశగా చూస్తోందట.