అలా.. కలుస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతా ఆర్ట్స్‌తో జిఎమ్‌బి జాయింట్ వెంచర్‌లో అభిరుచివున్న నిర్మాతలు కలిశారు. కాంబో ట్రెండ్‌పై ఎక్కువ ఆసక్తి చూపే ఇండస్ట్రీలో -గీతా ఆర్ట్స్ -హారిక హాసిని క్రియేషన్స్ కలసి అల వైకుంఠపురములో చిత్రాన్ని రూపొందించాయి. యువీ క్రియేషన్స్, జిఎ 2 సంస్థలు సంయుక్తంగా వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్‌లాంటి సంస్థలూ భాగస్వామ్య సినిమాలు చేస్తున్నాయి. మహేష్‌బాబు సొంత బ్యానర్ జిఎంబి పలు పెద్ద బ్యానర్లతో కలసి సినిమాలు నిర్మిస్తుండటం ఆసక్తికర విషయం. త్వరలోనే మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, గీతా ఆర్ట్స్ -్భగస్వామ్య ప్రాతిపదికన వరుస సినిమాలు నిర్మించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో నిర్మించనున్న ఓ ప్రయోగాత్మక సినిమాతో ఈ జర్నీ మొదలయ్యే అవకాశం ఉందన్నది ఇండస్ట్రీ టాక్. దర్శకుడు ప్రశాంత్ చెప్పిన లైన్ మహేష్‌కు నచ్చడంతో -అల్లు అరవింద్‌తో కలసి సినిమా చేయడానికి ప్రతిపాదించినట్టు వినిపిస్తోంది. ఈ కాంబోలో సినిమా వర్కౌటైతే -అతి భారీ ప్రాజెక్టులకు అడుగులు పడొచ్చన్న అంచనాలూ లేకపోలేదు. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ కేజీఫ్ చాప్టర్ 2తో బిజీగా ఉన్నాడు. దీని తరువాత మహేష్ -అరవింద్ నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కే సినిమానే ఉండొచ్చని అంటున్నారు. ఈలోగా మహేష్ కమిటైవున్న వంశీ పైడిపల్లి సినిమా పూర్తి చేస్తాడు. ఈ పరిణామాల్లో అనూహ్య కాంబినేషన్‌పై ఆసక్తి కనపడుతోంది.