గ్యాప్ ఫిల్లింగ్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది చిత్రం తరువాత.. ఆ స్థాయి హిట్టందుకున్న చిత్రం అలే. తరువాతి ప్రాజెక్టును జూ.ఎన్టీఆర్‌తో చేస్తాడంటూ వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన లేకున్నా -త్రివిక్రమ్‌తో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ సైతం ఆసక్తి చూపిస్తున్నాడన్న కథనాలూ వినిపించాయి. సో, వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్టు కష్టమైన విషయమేం కాదు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న -ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు ముందనుకున్న బ్లూప్రింట్ ప్రకారం అయిపోయి వుంటే.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్తుండేదే. కానీ, దర్శకుడు రాజవౌళి ట్రిపుల్ ఆర్‌ను తీర్చిదిద్దడానికి మరికొంత టైం తీసుకున్నాడు. అందులో భాగంగానే ప్రాజెక్టు రిలీజ్‌ను వచ్చే జనవరికి పోస్ట్‌పోన్ చేసుకోవడంతో -అప్పటి వరకూ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్‌తో ప్రాజెక్టు కోసం ఏడాదికాలం ఎదురు చూడాల్సిన పని త్రివిక్రమ్‌కు లేదు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో సినిమాను స్పీడ్‌గా లాగించేసే సత్తా త్రివిక్రమ్‌కు ఉంది కనుక -ఓ మీడియం రేంజ్ హీరోతో తనదైన మార్క్ సినిమాను లాగించేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలే గ్యాప్ తీసుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్న తరుణంలో -అలాంటి ఇమేజ్‌ వున్న దర్శకుడు ఒక హీరో కోసం ఏడాదిపాటు ఎదురు చూస్తాడని ఎవ్వరూ అనుకోరు. సో, త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. త్రివిక్రమ్‌కు వెంటనే డేట్స్ ఇచ్చేసేంత ఖాళీగానో, చేయాల్సిన ప్రాజెక్టుని వెనక్కి నెట్టేంత ఆసక్తివున్న మీడియం రేంజ్ హీరో ఎవరన్నది చూడాలి.