ఎక్కడైతే ఏంటి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా సినిమాలు హీరోకి పేరు తెస్తే -అప్పుడప్పుడూ కొన్ని మాత్రం డైరెక్టర్‌ని హీరోగా మార్చేస్తుంటాయి. గత రెండేళ్లలో అలాంటి స్టార్ ఇమేజ్ అందుకున్నవాడు -సందీప్ వంగా. అర్జున్‌రెడ్డి హిట్ తెచ్చిన ఇమేజ్ ఇక్కడ పెట్టుబడిగా పెట్టకుండా బాలీవుడికి వెళ్లిన సందీప్ -అక్కడా రీమేక్ ‘కబీర్ సింగ్’తో మరికొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాతృకను మించి రీమేక్ కలెక్ట్ చేయడంతో -సందీప్‌తో బాలీవుడ్ స్టార్స్ సినిమాలు చేస్తారనే అనుకున్నారంతా. అలా.. సందీప్ టీం -టి.సిరీస్ భాగస్వామ్యం కట్టాయి. అయితే, బాలీవుడ్‌లో వీళ్ల ప్రయత్నాలు ఫలించకపోవడుంతో -టాలీవుడ్‌కి ఫోకస్ మార్చినట్టు కనిపిస్తోంది. తెలుగు హీరోతో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించే ప్రణాళికతో ఉన్నారని వినిపిస్తోంది. సీన్‌లోకి దిగుతోన్న సందీప్‌తో జత కట్టేందుకు ఏ తెలుగు హీరో సిద్ధమవుతాడో? అడిగి కాదనిపించుకున్నాడు కనుక -సరైన సినిమాను తెరకెక్కించి బాలీవుడ్ స్టార్లు బిత్తరపోయేలాంటి కౌంటర్ ఏదైనా ఇస్తాడేమో చూడాలి. సత్తావున్న సందీప్.. తిక్కరేగి హిట్టు కొట్టాలేగానీ -ఇండస్ట్రీ ఏదైంతే ఏంటి?