అదే చెప్పాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, రష్మిక జోడీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ -్భష్మ. భారీ అంచనాల మధ్య శుక్రవారం సినిమా థియేటర్లకు వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు వెంకీ మీడియాతో ముచ్చటించాడు.
ఛలో సినిమా తరువాత నితిన్‌కు కొన్ని లైన్స్ చెప్పా. అప్పటికి ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్నాడు కనుక -అదే విషయాన్ని కంటెంట్ చేస్తూ చెప్పిన పాయింట్‌కి ఆయన కనెక్టయ్యాడు. బౌండ్ స్క్రిప్ట్ పూర్తి చేశాకే చేద్దామని చెప్పి ఏడాదిపాటు వెయిట్ చేశారు. లేటైనా -పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌తో చేసిన సినిమా కనుక కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
తెలుగులో అద్భుతమైన విలన్ పాత్రధారులు ఉన్నారు. కాకపోతే -నేను రాసుకున్న పాత్రకు రాయల్ స్ట్రేచర్ వున్న ఆర్టిస్ట్ కావాలి. సో, కన్నడ నటుడు అనంత్‌నాగ్‌ను ఎంపిక చేసుకున్నా. ఆయన్ని కలిసినపుడు వేరే భాషా సినిమాలు చేసే ఆలోచనలో లేరని తెలిసింది. బట్, ఆయన పాత్రకు సంబంధించి కంప్లీట్ ప్రొఫైల్ డిజైన్‌ను చూపించటం, ఆయన పాత్ర నచ్చటంతో ఓకే చేశారు.
నా ఫస్ట్ సినిమా ఛలోతోనే రష్మిక గుడ్ ఇంప్రెషన్ ఇచ్చింది. ఆ సినిమా చేస్తున్న టైంకి ‘తెలుగు’ అన్న పదం తప్ప ఇంకేమీ తెలీదు. అయినా భాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పి ఇంప్రెస్ చేసింది. ఈ సబ్జెక్ట్‌లో ఫిమేల్ లీడ్ పాత్ర రాస్తున్నపుడే ఆమె ఎక్స్‌ప్రెషనే్స గుర్తుకొచ్చేవి. కాకపోతే, నేను రెండో సినిమాకు వచ్చేసరికి ఆమె స్టార్ అయిపోయింది. ఒప్పుకుంటుందా? లేదా? అన్న సంకోచంతోనే సంప్రదించా. నితిన్ -రష్మిక కెమిస్ట్రీ స్క్రీన్‌పై ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది.
ఛలో టీంనే కంటిన్యూ చేయడానికి ప్రత్యేకమైన సెంటిమెంటో, కారణమో లేదు. టెక్నికల్‌గా ఒక టీం సెట్టవ్వడం కష్టం. సెట్టైన తరువాత వదలుకోలేం. టెక్నీషియన్స్‌తో మంచిగా సింకైంది కనుక -వాళ్లతోనే వర్క్ చేశా.
ఫస్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టానో, ఈ సినిమాకీ అంతే ఎఫర్ట్ పెట్టాను. తరువాత చేసే సినిమాలకూ అలాగే ఉంటుంది. బహుశా నేనే కాదు, ఎవ్వరైనా అలాగే కష్టపడతారు. కాకపోతే -ఎఫర్ట్ పెట్టగలం కానీ ఫలితాన్ని డిసైడ్ చేయలేం.
సినిమా చూసిన త్రివిక్రమ్ బావుందని సర్టిఫై చేయడం నాకు పెద్ద బలం. స్క్రిప్ట్‌లో ఆయన సజెషన్స్ ఏమీ లేవుగానీ, ట్రైలర్‌లోనే కథ చెప్పమని సలహానిచ్చారు. ఆడియన్స్ సినిమాకు ప్రిపేరై వస్తారన్నది ఆయన ఆలోచన. అందుకే టీజర్‌లో కనిపించని కథ -ట్రైలర్‌లో చెప్పేశాం. కచ్చితంగా ప్లస్ అవుతుందన్న భావనతో ఉన్నా.
డైలాగ్స్‌లో త్రివిక్రమ్ శైలి ఉందంటే ఉన్నట్టే. కాదనను. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ క్రియేటివ్ రైటర్ త్రివిక్రమ్. లోతైన విషయాన్ని కూడా సింపుల్ అన్వయింపుతో చెప్పిన శైలి ఆయనిది. అన్నీ రాసేశారు కనుక -మనమేం రాసినా అనుసరణలానే ఉంటుందన్నది నా అభిప్రాయం. ఆయన దగ్గర వర్క్ చేశాను కనుక -కాస్త ఎక్కువ ఇంపాక్ట్ ఉందేమో.
ఛలో హిట్టు పడినపుడు నాగశౌర్య మదర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ కారు. అది నా ఫస్ట్ సక్సెస్ గిఫ్ట్. దాన్ని అమ్మేశానన్న అపవాదు ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. వివాదాలకు దూరంగా ఉండాలనుకునే వ్యక్తిని. పైగా, నా పర్సనల్ విషయాలపై జనానికి ఆసక్తి ఉంటుందనీ అనుకోను. సో, -ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను.
తరువాతి ప్రాజెక్టుల గురించే ఇప్పుడే అయితే ఏమీ చెప్పలేను. నా దగ్గర రెండు లైన్స్ ఉన్నాయి. వాటిని డెవలప్ చేయడమా? కొత్త థాట్స్ తీసుకోవడమా అన్నది చూడాలి. ఐతే మైత్రి మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్, మరో ప్రొడక్షన్ హౌస్‌తో కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ అయితే అప్పుడు చెబుతా.
ప్రకృతి ఫలాలను ఆహారం చేసుకున్న ముందు జనరేషన్ -ఆరోగ్యంగా ఉంది.
అధికోత్పత్తికి ఆశపడి రసాయినాల ఆహారం తింటున్న మనం అనారోగ్యం బారిన పడుతున్నాం.
బిఎస్సీ అగ్రికల్చర్ చేసిన కుర్రాడిగా
ఈ మంచి విషయాన్ని ప్రజలకు
చెప్పాలనిపించింది.
అందుకు ‘్భష్మ’ కథను వాడాను.
*సినిమాల్లో కమర్షియాలిటీనే ఎక్కువ ఇష్టపడతా. అందుకే ఆర్గానికి అగ్రికల్చర్ పాయింట్‌పై అవగాహన కలిగిస్తూనే -్ఫన్ అండ్ రొమాంటిక్ కోణంలో కథను చెప్పే ప్రయత్నం చేశా. ఆర్గానికి ఫార్మింగ్ గురించి సందేశం ఉంటుంది కానీ, సందేశంలా అనిపించదు. సో, సందేశాత్మక కథను వినోదాత్మకంగా చూపించాననుకోవచ్చు.

-ప్రవవి