ప్రతి తండ్రికీ కనెక్టవుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్‌గౌడ సమర్పణలో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం -కాలేజ్ కుమార్. కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగు రీమేక్ చేశాడు దర్శకుడు హరి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేసిన సాయికుమార్ మాట్లాడుతూ -కాలేజ్ కుమార్ చిత్రానికి ప్రతి తండ్రీ కనెక్టవుతాడు. కన్నడ హిట్ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేస్తున్నామని దర్శకుడు సంతోష్ చెప్పినపుడు, విజయ్ మాస్టార్ అబ్బాయి రాహుల్ హీరోగా చేస్తున్నాడని తెలిసినపుడు చాలా హ్యాపీ ఫీలయ్యాను. సినిమాలో మంచి ఫీల్, ఎమోషన్స్ ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా విడుదలవుతుండటం కలిసొచ్చే విషయం. మార్చి 6న విడుదలవుతున్న చిత్రం తెలుగులోనూ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు హరి సంతోష్ మాట్లాడుతూ -ఓ మంచి చిత్రానికి ఆడియన్స్ ఆశీర్వాదం కావాలి అన్నారు. హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడుతూ -మంచి సినిమాలో చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా అన్నారు. హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ -కాలేజ్ కుమార్ ట్రైలర్ అందరికీ కనెక్టవ్వడం హ్యాపీగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ చేస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించడం మరింత నేర్చుకునేందుకు అవకాశం కలిగించేదే. మంచి సబ్జెక్ట్‌ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమిది అన్నారు. కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, ఫైట్‌మాస్టర్ విజయ్ తదితరులు మాట్లాడారు.