అయినా.. సూర్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో కొట్టిన హిట్లు తప్ప -లేటెస్ట్ సినిమాల గురించి చెప్పుకునే పరిస్థితి లేదు హీరో సూర్యకు. ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడినా -తమిళం, తెలుగులో సూర్య ఇమేజ్ ఇసుమంతైనా తగ్గలేదట. ప్రస్తుతం సూర్య చేతిలో వున్న సినిమా -ఆకాశం నీ హద్దురా. తెలుగమ్మాయి సుధా కొంగర తెరకెక్కిస్తోన్న చిత్రమిది. డెక్కన్ ఎయిర్‌వేస్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్ చిత్రమైనా -సూర్య చేస్తున్న కారణంగా ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చిందని అంటున్నారు. దర్శకురాలు సుధా కొంగర ప్రతిభ, సూర్య ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని -సన్‌నెట్ వర్క్ శాటిలైట్, ఓటీటీ రైట్స్‌ని ఎగరేసుకుపోయిందట. ఆ రెంటితో వచ్చిన మొత్తం సగం బడ్జెట్‌కి పైనే అంటున్నారు. థియేట్రికల్ రైట్స్, ఇతర రూపాల్లో వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకుంటే -ప్రాజెక్టు ప్లస్‌లో నడుస్తున్నట్టేనన్న మాట వినిపిస్తోంది. సో, సూర్య వరుస ఫ్లాపులిచ్చినా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపులే. ప్రాజెక్టు చిత్రీకరణ చివరి దశకు చేరడంతో -త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి సినిమాకు మరింత హైప్ తెచ్చేందుకు చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్ 9న సినిమా థియేటర్లకు రానుండటం తెలిసిందే.