స్కెచ్ బావుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక -హైదరాబాద్‌ను అడ్డా చేసుకోనుందట. టాలీవుడ్‌లో ఇప్పుడు రష్మిక టైం నడుస్తోంది. చేస్తున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్ ట్రాక్‌లో పరుగులు తీస్తుంటే, -టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడానికి పెద్ద స్కెచ్చే వేసుకుంటోందన్న మాట వినిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఎంత అందుబాటులో ఉంటే అవకాశాలు అంత చేజారకుండా ఉంటాయన్నది ఆమె ఆలోచన. జనవరిలో సరిలేరు నీకెవ్వరు హిట్‌ని ఎంజాయ్ చేసిన రష్మిక -్ఫబ్రవరిలో ‘్భష్మ’ హిట్‌ని ఎంజాయ్ చేస్తోంది. భీష్మ ప్రమోషన్స్ టైంలోనే -బెంగళూరు పెద్ద దూరమేంకాదు. గంట జర్నీ దూరంలోనే నువ్వున్నావ్. సో, అందుబాటులో ఉన్నట్టే అంటూ రష్మికను ఉద్దేశించి దర్శకుడు త్రివిక్రమ్ ఓ డైలాగ్ వదిలాడు. అయితే, అప్పటికే ఆమె కొన్ని ప్రాజెక్టుల పరిశీనలో ఉండటంతో -ఇప్పుడు హైదరాబాద్‌లో ఇల్లుకొనే ఆలోచన ఉందంటూ విషయం బయటపెట్టింది. అయితే, తెలుగులో మరో రెండు సినిమాలు చేసిన తరువాతే కొనాలన్నది ఆమెకు ఆమె పెట్టుకున్న కండిషన్. హైదరాబాద్‌లోనే ఉండిపోవాలని అనిపిస్తోందంటూ -్ఫస్ట్ డైలాగ్‌కు టాగ్ తగిలించి మరీ చెబుతోంది. మొన్నటి వరకూ -తననంతా తెలుగమ్మాయే అనుకుంటున్నారంటూ మైండ్ ట్యూన్ డైలాగ్ వాడిన రష్మిక, తాజాగా ఇల్లు ఆలోచన బయటపెట్టడం చూస్తుంటే.. పెద్ద ప్రాజెక్టులు ఆమెకు వర్కౌటవుతున్నట్టే అని అంటున్నారు. అందులో ముఖ్యంగా -జూ.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్టులో రష్మికకు చాన్స్ ఖరారైనట్టే అంటున్నారు. రష్మికకు తెలుగులో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘్భష్మ’ చిత్రానికి ఓకే చేసుకున్నపుడే -హారిక అండ్ హాసిని బ్యానర్‌కూ ఓ సినిమాకు ఒప్పందం చేసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. జూ.ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబో చిత్రాన్ని హారిక అండ్ హాసిని, కల్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. సో, హిట్ రన్‌లోవున్న రష్మికను ఈ ప్రాజెక్టుకు సెట్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే, అల.. వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్దె సైతం త్రివిక్రమ్ ఇంప్రెషన్‌లో ఉంది. వీళ్లిద్దరిలో ఎవరు బోర్డులోకి వస్తారన్నది తేలాలి. సో, గట్టిగా ప్రయత్నిస్తే చాన్స్ ఉంటుందన్న ఆలోచనతో రష్మిక -హైదరాబాద్‌లో నివాసం ఉంటానన్న డైలాగ్ వదిలిందంటున్న వారూ లేకపోలేదు. ఏదేమైనా -సరిలేరు నీకెవ్వరు, భీష్మ హిట్లుతో ఊపుమీదున్న రష్మిక.. తదుపరి స్టార్ హీరోల పక్కన చాన్స్‌ల కోసం గట్టిగా ట్రై చేస్తోంది. అల్ల అర్జున్, జూ.ఎన్టీఆర్‌లాంటి హీరోల పక్కన చాన్స్‌లు పడితే -రష్మిక టాప్ హీరోయిన్ కావడం కష్టమేం కాదు.