సరుూ.. బ్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ -అనగానే ఆడియన్స్ మైండ్‌లో స్పెషల్ మూడ్ ఉంటుందన్న నమ్మకం టాలీవుడ్‌ని ఇంకా వీడలేదు. అందుకే ప్రాజెక్టుని బతికించటం కోసం -పారితోషికాలకు వెరవకుండా బాలీవుడ్ అందాలను టాలీ స్క్రీన్‌పై చూపించే ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూడీలకూ -టాలీవుడ్ స్క్రీన్ ‘స్పెషల్’ అట్రాక్షన్ అవుతుండటంతో ఏ పాత్రకైనా ఓకే చెప్తున్నారు. సో, మధ్యేమార్గంగా టికెట్ రేటుకు తగినంత గ్లామర్ ఆడియన్స్‌కీ అందుతోంది. ఇదంతా ఎందుకంటే -హీరో వరుణ్ తేజ్ చేస్తున్న తాజా ప్రాజెక్టులోకి మరో బాలీవుడ్ బ్యూటీ అడుగు పెట్టనుందట. వరుణ్‌తో రొమాన్స్ చేసి మెప్పించటానికి బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సరుూ మంజ్రేకర్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. సల్మాన్ సరసన ‘దబాంగ్ 3’లో సందడి చేసిన సరుూ -వరుణ్‌కు జోడీగా కనిపించనుందన్న మాట. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ప్రాజెక్టు 24నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్‌తో మెప్పించి మాస్ హిట్టందుకున్న వరుణ్ -కొత్త ప్రాజెక్టులో బాక్సర్‌గా కనిపించనున్నాడు. అల్లు బాబీ, సందీప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.