నితిన్.. మొదలెట్టేశాడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భీష్మ ఆనందం చల్లారకముందే -నితిన్ ‘అంధాధున్’ మొదలెట్టేశాడు. వరుస ఫ్లాపులతో సతమతమైన నితిన్ ఏడాదిన్నర గ్యాప్ తరువాత దర్శకుడు వెంకీ కుడుములతో చేసిన సినిమా భీష్మ. గత శుక్రవారం విడుదలైన సినిమా హిట్ టాక్‌తో నడుస్తుండగానే -కొత్త సినిమాను లాంఛనంగా మొదలెట్టాడు నితిన్. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా చేసిన అంధాధున్ -మూడు జాతీయ అవార్డులు కొల్లగొట్టడం తెలిసిందే. బాలీవుడ్లో హిట్ ప్రకంపనలు సృష్టించిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి హక్కుల్ని నితిన్ సొంత బ్యానర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు శ్రేష్ఠ్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలుగా -దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెలుగు రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాత చినబాబు దర్శకుడికి స్క్రిప్ట్ హ్యాండోవర్ చేస్తే, తొలి సన్నివేశానికి శ్యాంప్రసాద్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేస్తే -దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హరి కె వేదాంత్ సినిమాటోగ్రఫీ సమకూర్చనున్నాడు. హీరోయిన్, ఇతర పాత్రలు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. జూన్ నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు చెబుతున్నారు.