ఫిక్సైపోయిన(హి)ట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వక్సేన్, రుహానీశర్మ జోడీగా వాల్‌పోస్టర్ బ్యానర్‌పై శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం -హిట్. ది ఫస్ట్ కేస్ అన్నది ట్యాగ్‌లైన్. హీరో నాని సమర్పిస్తోన్న చిత్రాన్ని ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. విశ్వక్సేన్ ఐపీఎస్ అధికారి విక్రమ్ రుద్రరాజు పాత్రలో కనిపించనున్నారు. 28న సినిమా థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో -హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి రాఘవేంద్రరావు, ఎస్‌ఎస్ రాజవౌళి, రానా దగ్గుబాటి, అనుష్కశెట్టి, దిల్‌రాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. స్నీక్‌పీక్, బిగ్ టికెట్‌ను రాజవౌళి విడుదల చేయగా, టికెట్‌ను దిల్‌రాజు కొన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ -‘అ’తో నిర్మాతగా ఓనమాలు నేర్చుకున్న నాని ఇప్పుడు హిట్ వరకూ వచ్చేశాడు. వెంకన్న సైన్యాధిపతి విశ్వక్సేనుడు. ఆ పేరు పెట్టుకున్న విశ్వక్‌ను వెంకన్న ఆశీస్సులుంటాయి. డైరెక్టర్ శైలేష్, ప్రశాంతికి అభినందనలు అన్నారు. దర్శకధీరుడు రాజవౌళి మాట్లాడుతూ -హిట్‌ను బాగా ప్రమోట్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ స్టైలిష్‌గా ఉంది. ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తించేలా ‘స్నీక్‌పీక్’ ఐడియా అద్భుతంగా ఉంది. ఇది ఫస్ట్ కేస్ అంటూ హిట్‌ని రిలీజ్ చేస్తున్నారు. దీని తరువాత సెకెండ్ కేస్, థర్డ్ కేస్ అంటూ సినిమా ఫ్రాంచైజీ లెవెల్‌కి రావాలని ఆకాంక్షిస్తున్నా. సినిమా ‘హిట్’ కావాలి. నాని, శైలేష్‌కు అభినందనలు అన్నారు. అనుష్కశెట్టి మాట్లాడుతూ -ప్రశాంతి, నాని నా కుటుంబ సభ్యుల్లాంటివారు. మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తారని తెలుసు. నేను కూడా హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ -నాని హీరోగా మారి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం బావుంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ -మా బ్యానర్‌లో ఇప్పటికే విశ్వక్ రెండు సినిమాలు చేశాడు. మూడో సినిమాకు రెడీ అవుతున్నారు. అతని డేరింగ్‌కు హ్యాట్సాఫ్. సైలెంట్‌గా సినిమాలు చేస్తూ వెళ్తోన్న నాని, ప్రశాంతికి అభినందనలు అన్నాడు. నిర్మాత నాని మాట్లాడుతూ -దర్శకుడు శైలేష్ బాగా చదువుకున్న వ్యక్తి. తను చెప్పిన కథను ఓకే చేశాక, చెడగొడుతున్నానా? ప్రోత్సహిస్తున్నానా? అన్న చిన్న డౌట్ ఉండేది. జాబ్‌కి లీవ్ పెట్టి ప్రయత్నించు తప్ప, వదిలేయొద్దని చెప్పేవాడిని. ఇప్పుడు చెబుతున్నా, శైలేష్ జాబ్ రిజైన్ చేసేయొచ్చు. దర్శకుడిగా హిట్‌తో అతనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక విశ్వక్ వరైటైల్ ఆర్టిస్టు. ఏ పాత్రనైనా అద్భుతంగా పోషించగలడు. రుహాని మంచి పెర్ఫార్మర్ అన్న విషయం చి.ల.సౌతోనే ప్రూవ్ అయ్యింది. టెక్నీషియన్లు వివేక్‌సాగర్, మణికందన్, గ్యారీ -ప్రాజెక్టును అద్భుతం లెవెల్‌కి తీసుకెళ్లారు. హిట్ డెఫినెట్‌గా హిట్టవుతుందన్న నమ్మకంతో ఉన్నా అన్నారు. హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ -ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు.. ప్రతి ఒక్కరూ ఎవరి పాత్ర వాళ్లు పోషించేశారు. దర్శకుడు వెరీ టాలెంటెడ్. అందుకే హిట్‌తో మీముందుకు కాన్ఫిడెంట్‌గా వస్తున్నా. పావుగంట థియేటర్‌లో మీరు కూర్చోండి. ఆ తరువాత మేమే కూర్చోబెడతాం. తల తిప్పడానికి కూడా అవకాశమివ్వని ఇంటెన్స్ థ్రిల్లర్‌తో వస్తున్నాం. అందుకే ఫైనల్‌గా ఒకటి చెబుతున్నా. ఈసారి డైలాగ్స్ లేవు. డైరెక్ట్‌గా బుల్లెట్టే అన్నాడు. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ -కథను రాసి నానికి వినిపిస్తు నువ్వే డైరెక్ట్ చెయ్ అంటూ ఎంకరేజ్ చేశాడు. షాక్ తిన్నాగానీ, సిడ్నీ వెళ్లి డైరెక్షన్‌లో మెళకువలు నేర్చుకుని వచ్చా. నా లైఫ్‌లో నాని మార్గదర్శి. కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేస్తానో తెలీదుగానీ, నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన నాని గర్వపడేలా మాత్రం సినిమాలు చేస్తా అన్నాడు. హీరోయిన్ రుహాని శర్మ మాట్లాడుతూ -ఇది నా రెండో సినిమా. చాలా పొటెన్షియల్‌తో చేసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. కార్యక్రమంలో అల్లరి నరేష్, సందీప్‌కిషన్ తదితరులు మాట్లాడారు.