హిందీ ఖైదీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు -హిందీ సినిమా, ప్రాంతీయ సినిమా అన్న అంతరాలు ఉండేవి. ఇప్పుడు -ఏ భాషా చిత్రమైన ఒక రేంజ్‌లో రెడీ అవుతోంది. హిందీ సినిమా బడ్జెట్, స్టామినాకు ఏమాత్రం తగ్గకుండా సౌత్‌లోనూ సినిమాలు సిద్ధమవుతుండటంతో -హిట్ సినిమాలను క్యాష్ చేసుకునే సులువైన మార్గాన్ని బాలీవుడ్ అనుసరిస్తోంది. ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో ఎక్కువ రీమేక్ అవుతుండటానికి కారణం -హిట్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడానికే. ఇటీవలే కొత్త దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తమిళ హీరో కార్తి ‘ఖైదీ’ చేశాడు. భాషతో పెద్దగా సంబంధం లేని యూనివర్శల్ కంటెంట్ కావడం, తెలుగులోనూ కార్తికి మంచి మార్కెట్ క్రియేటై ఉండటంతో -తెలుగు మార్కెట్‌లోనూ సినిమా వసూళ్ల వర్షమే కురిపించింది. విమర్శకుల నుంచీ ప్రశంసలు రావడంతో -బాలీవుడ్ రీమేక్ రైట్స్‌ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తన్నుకుపోయింది. డ్రీమ్ వారియర్స్‌తో కలిసి ఖైదీ కంటెంట్‌ను తెరకెక్కించేందుకు -హీరో వేటలో పడ్డాయట నిర్మాణ సంస్థలు. సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్ ఇద్దరిలో ఎవరో ఒకరిని బోర్డ్‌లోకి తెచ్చే అవకాశం ఉందని బలంగా వినిపించినా -తాజాగా అజయ్ దేవ్‌గణ్‌తో డీల్ ఓకే అయినట్టు తెలుస్తోంది. ఖైదీ మాతృకను చూసిన అజయ్, స్క్రిప్ట్ కూడా విన్న తరువాతే ఓకే చేసినట్టు చెబుతున్నారు. సో, హీరో కన్పర్మ్ అయిపోవడంతో -ప్రాజెక్టుని డీల్ చేసే దర్శకుడెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం అజయ్ ‘మైదాన్’తో బిజీగా ఉన్నారు. రాజవౌళి తెరకెక్కిస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’లోనూ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఖైదీ రీమేక్‌కు దర్శకుడూ కన్ఫర్మ్ అయిపోతే -త్వరలోనే ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లొచ్చు.