నాని -శ్యామ్ సింగరాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని మరో సినిమా మొదలెట్టేశాడు. జెర్సీతో ఘన విజయం అందుకున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీతోనే మరోసారి జోడీ కట్టాడు. విజయ్ దేవరకొండతో టాక్సీవాలా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ నాగ-నాని ప్రాజెక్టుకు దర్శకుడు. నాని పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ సహా ప్రాజెక్టును అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. శ్యామ్ సింగరాయ్‌గా రానున్న నాని ప్రచారం చిత్రం, వీడియోను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. నానికి ఇది 27వ ప్రాజెక్టు. సినిమాను ప్రకటించిన పోస్టర్‌పైనే డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించటం విశేషం. నటీనటులు, సాంకేతిక వర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.