సిమి పాత్రలో.. అనసూయే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు యాంకరింగ్.. ఇటు యాక్టింగ్. జోడు పడవలపై సక్సెస్‌ఫుల్ ఫీట్స్ చేసి చూపిస్తోంది అనసూయ. అందం, అభినయం.. కొన్ని ప్రత్యేక పాత్రలకు యాప్ట్ ఆర్టిస్ట్‌లాంటి అంశాలన్నీ కలిసి రావడంతో -రెమ్యునరేషన్స్‌లో పోటీ పడలేకున్నా ఇమేజ్ మాత్రం అనసూయ హీరోయిన్లతో పోటీ పడుతోంది అనడంలో సందేహం లేదు. వైవిధ్యమైన పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్లాన్డ్‌గా అడుగులేస్తున్న అనసూయకు -మరో పెద్ద ఆఫర్ దాదాపు ఖరారైనట్టేనన్న కథనాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. హిందీలో ఆయుష్మాన్ ఖురానా చేసిన ‘అంధాధున్’ సెనే్సషన్ హిట్టు కావడం తెలిసిందే. ఆ సినిమాకు ఆయుష్మాన్ ఎంత ప్రాణం పెట్టాడో, విలన్ పాత్ర సిమి సిన్హాగా టబు అంతకంటే ఎక్కవ ప్రాణమే పోసింది. కథలో ఆ పాత్ర కీలకం కావడం, హీరోతో ఎక్కువ కాంబో సీన్స్ ఉండటం, కాస్త బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉండటంతో -ఆ పాత్రకు ఆప్ట్ ఆర్టిస్టు అనసూయ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆ ప్రాతకోసం టబును సంప్రదించాలన్న ఆలోచన నిర్మాతలకు ఉన్నా, చిన్న బడ్జెట్‌లో సినిమాను నిర్మించడమే మంచిదన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. టబుతో కంపేర్ చేస్తే తక్కువ రెమ్యునరేషన్, ఎక్కువ డేట్స్ కేటాయించుకునే అవకాశం, ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు సైతం తగ్గడం, అనసూయకు ప్రస్తుతం మంచి ఇమేజ్ ఉండటంతో -చిత్రబృందం ఆమెను కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్‌వున్న పాత్ర కనుక అనసూయ సైతం నో చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. రంగస్థలంలో రంగమ్మత్తగా ఆ పాత్రకు ప్రాణం పోసి అప్లాజ్ తీసుకున్న అనసూయ -ఈ ఛాలెంజింగ్ పాత్రలో మంచి పెర్ఫార్మెనే్స ఇవ్వగలదన్న అంచనాలూ లేకపోలేదు. సో, నితిన్ హోం బ్యానర్‌పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కన్నున రీమేక్‌లో అనసూయకు బెర్త్ ఖాయమనే అనుకోవచ్చు. హిట్టైన సినిమాకు రీమేక్‌గా వచ్చే సినిమాలన్నీ హిట్లుకొట్టాలన్న రూలేం లేదు కనుక -నితిన్ చేస్తోన్న ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో, ఎవరికెలాంటి పేరు తెస్తుందో చూడాలి.