నారప్పకు కొత్తందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో అసురన్ విడుదలై హిట్టనిపించుకున్నాకే సెనే్సషనైతే, తెలుగు రీమేక్ ‘నారప్ప’ ఫస్ట్‌లుక్ నుంచే సెనే్సషనవుతోంది. వెంకటేష్ ఫస్ట్ లుక్ స్టిల్స్‌తో చిత్రబృందం ఇండస్ట్రీని హీటెక్కించింది. సురేష్ మూవీస్ చేతికి రీమేక్ హక్కులు వచ్చిన దగ్గర్నుంచీ అనేకమంది పేర్లు వినిపించినా -చివరకు వెంకటేష్ బోర్డ్‌లోకి వచ్చాడు. సురేష్‌బాబు, కళైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తోన్న రీమేక్‌ను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్‌కు జోడీగా ఇప్పటికే ప్రియమణిని ఎంపిక చేస్తే, తాజాగా మలయాళ బ్యూటీ రెబ్బా మోనిక జాన్ పేరు కూడా వినిపిస్తోంది. తమిళనాడు షెడ్యూల్‌లో ఇప్పటికే రెబ్బా చేరిందన్న వార్తలూ వస్తున్నాయి. రీమేక్ కనుక షూటింగ్ వేగంగా పూర్తి చేసి వచ్చే మేలోనే సినిమాను థియేటర్లకు తెచ్చే ప్రణాళికను చిత్రబృందం రెడీ చేసిందట. రెండు మూడువారాల్లో తమిళనాడు షెడ్యూల్ పూర్తిచేసి, మార్చి రెండోవారానికి శ్రీకాంత్ అడ్డాల తన టీంని హైదరాబాద్‌కు షిప్ట్ చేస్తాడని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ సైతం వేగంగా పూర్తి చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. సో, వచ్చే నెల చివరి వారంనుంచే ఇండస్ట్రీలో నారప్ప హీట్ మొదలయ్యే అవకాశం ఉందన్న మాట.