వెంకీని కాపీ కొట్టేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ భీష్మ’ సక్సెస్ ఇస్తోన్న ఆనందం మాటల్లో చెప్పలేనంతగా ఉంది. సినిమాలో నితిన్ బాగా నవ్వించాడంటుంటే మరింత ఆనందంగా ఉంది. నిజానికి -నేను కష్టపడిందేమీ లేదు. దర్శకుడు వెంకీ ఎలా చేయమంటే అలా చేసేశానంతే -అంటున్నాడు హీరో నితిన్. ఒకరకంగా దర్శకుడిని కాపీ కొట్టానంటూ నర్మగర్భమైన డైలాగ్ వదిలాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నితిన్ -రష్మిక మండన జోడీగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం భీష్మ. సూర్యదేవర నాగవంశీ రూపొందించిన చిత్రం మంచి విజయం సాధించటంతో -మంగళవారం చిత్రబృందం సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంలో నితిన్ మీడియాతో మాట్లాడుతూ -సినిమా కోసం దర్శకుడు వెంకీ చాలా కష్టపడ్డాడంటూ కితాబునిచ్చాడు. భీష్మ హిట్‌తో వెంకీ కుడుముల చాలామందికే సైలెంట్ సమాధానిమిచ్చాడని నితిన్ అన్నాడు. నాలుగేళ్ల తరువాత తనకొచ్చిన హిట్‌తో భావోద్వేగానికి గురవుతున్నానని, రీ రికార్డింగ్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అన్నారు. రష్మిక, సంపత్‌రాజ్‌ల యాక్షన్ సినిమాకు అద్భుతంగా కుదిరిందని, అలాగే పాటల రచయితలు మంచి పాటలిచ్చి సినిమా హిట్‌లో భాగమయ్యారన్నాడు. ఈ సంస్థతో మరెన్నో చిత్రాలు చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ రష్మిక మండన మాట్లాడుతూ -విశే్లషకులు ఈ సినిమాకు మంచి రివ్యూస్ ఇవ్వడం, ముఖ్యంగా తన పాత్ర అందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. భీష్మ చిత్రంలో నితిన్‌ని చూసి అతని అభిమానిగా మారానని, సంగీతం, కెమెరా పనితనం చక్కకా కుదిరిన సినిమా ఇది అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా సూపర్‌హిట్టవుతుందన్న మాటను ప్రేక్షకులు నిజం చేశారని, ఛలో తరువాత భీష్మతో వెంకీ హిట్లు కొట్టాడని, మూడో చిత్రం కూడా హ్యాట్రిక్ హిట్ కావాలని అన్నారు. రష్మిక హీరోలతో పోటీపడి డ్యాన్స్ చేయగలదని, మంచి కామెడీ, కంటెంట్ బలంగా వుంటే ప్రేక్షకులు తప్పక సినిమాను హిట్ రేంజ్‌లో నిలబెడతారన్న నమ్మకం కుదిరిందన్నారు. సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ తనకు సహకరించినందువల్లే మంచి సినిమా తీయగలిగానని, అలాగే నితిన్ కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రను డిజైన్ చేయడం, దానికి అందరూ కలిసి సక్సెస్ ఇవ్వడం నా కెరీర్‌లో బెస్ట్ అఛీవ్‌మెంట్ అని దర్శకుడు వెంకీ కుడుముల అన్నారు. చిత్రంలో సంపత్‌రాజ్, అనంత్ నాగ్, జిష్ణుసేన్ గుప్తా అద్భుతంగా నటించారని, నితిన్ అభిమానిగా తాను కూడా మారిపోయానన్నారు. కథ వినగానే రష్మిక స్నేహానికి విలువనిచ్చి చిత్రంలో నటించడం మర్చిపోలేని విషయమన్నారు. కార్యక్రమంలో కాసర్ల శ్యామ్, సంగీత దర్శకుడు మహతీ స్వర సాగర్, సంపత్‌రాజ్, సాయి శ్రీరామ్, సాహి సురేష్, చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.