క్రాక్‌తో కిక్కి’స్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనదైన పెర్ఫార్మింగ్ ఫార్మాట్ కారణంగా ప్రయోగమనిపించకున్నా.. రవితేజ చాలా ప్రయోగాలే చేశాడు. నా ఆటోగ్రాఫ్ విత్ స్వీట్ మెమరీస్.. సారొచ్చారు... శంభో శివ శంభోలాంటి సినిమాలను ప్రయోగాల కోణంలోనే చూడాలి. మధ్యలో కలిసొచ్చిన కమర్షియల్ మాస్ సినిమాలు చేసిన రవితేజ.. మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కోరాజా చిత్రాలతో ప్రయోగాలే చేశాడు. కానీ కలి సిరాలేదు. మళ్లీ కెరీర్ కాలింది. మాస్ సినిమాలతో మహరాజా అనిపించుకున్న రవితేజ -ప్రయోగాత్మక సినిమాలతో మార్కెట్‌లో వెనక్కిపోవడంతో.. ప్రయోగాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు రవితేజ నుంచి వస్తోన్న సినిమా -క్రాక్. డాన్‌శీను, బలుపులాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసిన గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న చిత్రమిది. రవితేజకు పడిన వరుస ఫ్లాపుల కారణంగా ‘క్రాక్’ పెద్ద క్రేజ్‌ లేకుండానే మొదలైనా.. టీజర్‌ని చూశాక సీన్ మారినట్టే కనిపిస్తోంది. మాస్ ఆడియన్స్ పల్స్‌ని మళ్లీ రవితేజ టచ్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. స్టయిలిష్ షాట్స్, తనదైన డైలాగ్ మాడ్యులేషన్స్‌తో ‘క్రాక్’ పుట్టించేలా కనిపించాడు రవితేజ. డిస్కోరాజా ఫెయిల్యూర్ ఎఫెక్ట్‌ని కాంపెనే్సట్ చేసేలావున్న ‘క్రాక్’పై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. క్రాక్ కనుక హిట్టుపడితే -మూసలా అనిపించినా ‘మాస్’ డైమన్షన్‌లోనే కొన్నాళ్లు రవితేజ కెరీర్ సాగడం ఖాయం.