సాహస ప్రయాణంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురు అపరిచితులు. వేల కిలోమీటర్ల ప్రయాణం. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎటు? ఎందుకు? వాళ్లకెదురైన అనుభవాలు..? ఈ ప్రశ్నలకు సమాధానాలే ప్రధాన కానె్సప్ట్‌గా సుమంత్ అశ్విన్ సినిమా మొదలైంది. గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత జి మహేష్ తొలి సినిమా నిర్మిస్తున్నాడు. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని కనిపించనున్నారు. దిగ్గజ దర్శకుల వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన గురుపవన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ఎన్‌బి బాలసుబ్రహ్మణ్యం క్లాప్‌నిస్తే, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్‌లో దర్శకుడు గురుపవన్ మాట్లాడుతూ -మంచి అభిరుచివున్న నిర్మాత మహేష్. భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్ నుంచి బైకులపై చేసే సుదీర్ఘ ప్రయాణమే సినిమా. వాళ్ల జర్నీకి కారణమేంటి? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ల అనుభవాలేంటి? అన్నది ప్రధానాంశం. మార్చి 2న తొలి షెడ్యూల్, మార్చి 22నుంచి రెండో షెడ్యూలు ప్లాన్ చేశాం. హైదరాబాద్, ఝాన్సీ, నాగపూర్, గ్వాలియర్, మనాలివంటి లొకేషన్లలో చిత్రీకరిస్తాం. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్ అస్సెట్ అన్నారు. హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ -షూటింగ్ కోసం ఉత్సాహంగా చూస్తున్నా. శ్రీకాంత్, ఇంద్రజవంటి ఫెంటాస్టిక్ ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో వస్తోన్న చిత్రాలకు ఇది కాస్త వైవిధ్యంగా ఉండటం ఖాయం అన్నారు. ఇంద్రజ మాట్లాడుతూ -స్టోరీ వెరైటీగా ఉంది. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్‌వున్న పాత్ర చేస్తున్నా. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న నాకు ఇదొక ఫీస్ట్‌లాంటి క్యారెక్టర్. తన కలలు నెరవేర్చుకోడానికి ప్రయత్నించే ఒక గృహిణిగా నటిస్తున్నా. రెండు రకాల లుక్స్‌లో కనిపిస్తా. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. శ్రీకాంత్, నేను ‘జంతర్‌మంతర్’తో ఒకేసారి సోలో హీరో హీరోయిన్లు అయ్యాం. ఇన్నాళ్లకు తనతో మళ్లీ కలిసి నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది అన్నారు. హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడుతూ -ఇంద్రజ, శ్రీకాంత్‌లాంటి పెద్ద ఆర్టిస్టులతో కలిసి పని చెయ్యడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎగ్జైటింగ్ స్క్రిప్టుతో తయారవుతోన్న సినిమా ఇది అన్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ -డైరెక్టర్ గురుపవన్ చెప్పిన కథ ఎగ్జైట్ చేసింది. బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అవకాశమున్న స్టోరీ అన్నారు. నిర్మాత మహేష్ మాట్లాడుతూ -నిర్మాతగా తొలి సినిమా. గురుపవన్ చెప్పిన కథకు కనెక్టై చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నా. అన్ని ఏజ్‌లకూ రీచయ్యే చక్కని అడ్వెంచరస్ స్టోరీ ఇది అన్నారు.