కాయ కష్టానికి.. తగిన ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా దగ్గుబాటి మారిపోయాడు. ప్రొఫైలే మార్చేసుకున్నాడు. అడవిపై మానవ పంజా -కానె్సప్ట్‌తో దర్శకుడు ప్రభుసాల్మన్ తెరకెక్కిస్తోన్న చిత్రం అరణ్య. ఆ కథలో బల్దేవ్ ఇలా ఉండాలని ప్రభుసాల్మన్ చెప్పడమే తరువాయి.. కష్టపడి పెంచిన హల్క్ ఆకృతిని వదిలేశాడు. పాత్ర కోసం ఆకారాన్ని మార్చేసుకున్న ఆర్టిస్టులు ఇంతకుముందు లేకపోలేదు. కాకపోతే -ఏనుగుల సంరక్షకుడైన బల్దేవ్‌గా కనిపించడానికి ఇష్టమైన ప్రొఫైల్‌నే వదిలేసిన రానా కష్టాన్ని తక్కువ చేసి చూడలేం. కానె్సప్ట్ మంచిది కావడం, తగినట్టు చూపించడానికి పడిన కష్టం.. వెరసి మంచి ఫలితం దక్కుతుందన్న నమ్మకాలు ఇండస్ట్రీలో పెరుగుతున్నాయి. విడుదల తేదీ (ఏప్రిల్ 2) దగ్గర పడుతున్నా -హిందీ, తమిళంతోపాటు తెలుగులోనూ రానున్న ‘అరణ్య’ ప్రమోషన్స్ అంత ఉధృతంగా ఏమీ లేవు. అయినా.. ఇప్పటికే విడుదలైన రానా లుక్స్.. ప్రాజెక్టు అప్‌డేట్స్.. బయటికొచ్చిన టీజర్‌తో ఆడియన్స్‌లో అమితాసక్తి కనిపిస్తోంది. బాహుబలి కోసం ‘హల్క్’ అవతారమెత్తిన రానా, అరణ్య కోసం ఉక్కులాంటి దేహాన్ని బక్కపల్చన చేసేశాడు. ‘భల్లాలదేవుడి పాత్ర కోసం బరువు పెరిగా. బల్దేవ్ పాత్ర కోసం బక్కగా తయారయ్యా. 30 కేజీల కండ తగ్గించడానికి భారీ కసరత్తే చేయాల్సి వచ్చింది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో రానా చెప్పడాన్ని మర్చిపోలేం. మనుష్య సంచారం లేని ప్రాంతాల్లో షూటింగ్ జరపటం కోసం చిత్రబృందం పడిన కష్టాన్నీ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రానా. ఏనుగులతో చేసిన సన్నివేశాల కోసం ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చిందన్నది రానా చెప్పిన మాట. ఈ ప్రాజెక్టు కోసం చిత్రబృందం పడిన కష్టం -ట్రైలర్‌లో కనిపించింది. సో, అరణ్య పాత్ర కోసం అవతారానే్న మార్చేసుకున్న రానాకు మంచి హిట్టే పడొచ్చని, అడవి నేపథ్యంగా సాగే ఆసక్తికరమైన కథ కనుక ఆడియన్స్‌కి బలంగానే కనెక్టవుతుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.