రాహు.. జ్ఞాపకాలు వెంటాడతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలకు ముందే ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం -రాహు. శుక్రవారం సినిమా థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా లీడ్‌రోల్ పోషించిన కృతి గార్గ్ మీడియాతో మాట్లాడారు.
* నేను రాజస్థాన్ అమ్మాయిని. వెబ్ సిరీస్‌లతో నా కెరీర్ మొదలైంది. తెలుగులో రెండో సినిమా రాహు. మంచి గుర్తింపునిస్తుందనే అనుకుంటున్నా.
* రాహు- ఓ న్యూ ఏజ్ థ్రిల్లర్. ట్రెండ్‌కు తగిన సినిమా ఆడియన్స్ ముందుకొస్తోంది. సినిమా చూసినవాళ్లను రాహు జ్ఞాపకాలు కొంతకాలం వెంటాడటం ఖాయం. ఓ మంచి థ్రిల్లర్‌ను థియేటర్స్‌లో ఎంజాయ్ చేద్దాం.
* రాహులో నాది భాను పాత్ర. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర చేయడం అదృష్టం, సాహసం అనిపిస్తోంది. ఇలాంటి పాత్రలు ఏ హీరోయిన్ కెరీర్‌లోనైనా అరుదుగా దక్కుతాయి. దర్శకుడు సుబ్బు ఆడిషన్స్ చేసి నన్ను ఎంపికచేశారు. ఆడిషన్స్ టైంలోనే ఆయన వర్క్ ఎంత డీటెయిల్డ్‌గా ఉంటుందో అర్థమైంది. కొత్త దర్శకుడు చేసిన సినిమా చూస్తున్నామన్న భావన ఎక్కడా కలగదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు పెద్ద సపోర్ట్.
* రాహు కథ నా చుట్టూనే తిరుగుతుంది. కన్వర్షన్ డిజార్డర్‌తో ఇబ్బంది పడే పాత్ర నాది. రక్తం చూస్తే నాకు కళ్లు కనిపించవు. చిన్నపుడు తల్లిని కోల్పోయిన అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని దర్శకుడు సుబ్బు అద్భుతంగా తెరకెక్కించారు.* హీరో అభిరామ్, నేను.. ఇద్దరూ ఒకే స్టేజ్‌లో ఉన్నాం. సో, మా పని ఫ్రెండ్లీగా సాగిపోయింది. రాహులో ముఖ్య పాత్ర పోషించిన కాలకేయ ప్రభాకర్‌తో పని చేయడం కెరీర్‌లో గుడ్ ఎక్స్‌పీరియన్స్.
* ఏమో ఏమో అన్న పాటను సెనే్సషనల్ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడారు. ఆ పాటనే కాదు, అందుకు తగిన పిక్చరైజేషన్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
* నటిగా అన్ని జోనర్ల సినిమాలు, మంచి పాత్రలు చేయాలన్నది నా ఆలోచన. కథ, కథనాల మేరకు గ్లామర్ రోల్స్ చెయ్యడానికీ సిద్ధం. రాహులో పాత్ర పరిధిమేరకు గ్లామరస్‌గా కనిపిస్తాను.
* సుబ్బు ఫ్యాషనేట్ ఫిల్మ్‌మేకర్. కథను నేరెట్ చేసినపుడే నచ్చింది. అంతే అందంగా స్క్రీన్‌మీద ప్రజెంట్ చేశారు. విడుదలకు ముందే సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుండటం ప్రాజెక్టు స్టామినాను చెబుతోంది. రాహు గురించి విజయశాంతి ట్వీట్ చేయడం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత పెద్ద నటి మా సినిమాకు ఇచ్చిన ఆశీర్వాదం అనిపించింది. ఆమెకు రాహు టీం తరఫున కృతజ్ఞతలు.