ఆ కళ్లలో.. ప్రేమే చూస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిరత్నం ‘ఓకె బంగారం‘, నాగ్‌అశ్విన్ ‘మహానటి’తో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైన మలయాళీ హీరో -దుల్కర్ సల్మాన్. పెళ్లిచూపులు ఫేమ్ రీతూవర్మ జోడీగా దుల్కర్ నుంచి వస్తోన్న సినిమా -కనులు కనులను దోచాయంటే. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కి దేసింగ్ పెరియస్వామి దర్శకుడు. వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా సినిమాని రూపొందించాయి. తెలుగులో కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది. సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంలో దుల్కర్ సల్మాన్ మీడియాతో మాట్లాడారు.
* మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షులకు బాగా దగ్గరయాను. ఆ సినిమా విడుదలైన అన్ని భాషల్లో నాకు మంచి పేరు తీసుకొచ్చింది.
* ద్విభాషా చిత్రాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నానని చాలామంది అంటుంటారు. అన్ని కథలూ బైలింగ్వల్ చేయలేం. అలాగని, బైలింగ్వల్స్‌ని ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యను కూడా. ఇప్పుడు ఆడియన్స్ ముందుకొస్తున్న ‘కనులు కనులను దోచాయంటే’ -పర్ఫెక్ట్ సౌత్ సినిమా అనుకుంటున్నా. తెలుగు, తమిళ భాషా ఆడియన్స్ టేస్ట్‌కి అనుగుణమైన సినిమా కనుక -రైట్ టైంలో వస్తున్నాననే అనుకుంటున్నా.
* తమిళంలో ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచీ రీతూవర్మ చాలా హెల్ప్ చేసింది. ఆమె అద్భుతమైన తమిళం మాట్లాడుతుంది. రీతూ వెరీ ప్రొఫెషనల్, ఆమెతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. రక్షక్, నిరంజని, ఇతర ఆర్టిస్టులు వాళ్లందరితో షూటింగ్ సరదాగా సాగిపోయింది.
* వివిధ భాషల్లో సినిమాలు చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే, ఆయా భాషా ఆడియన్స్ నన్ను ఆదరిస్తుండటం హ్యాపీగా ఉంది. ఆదరిస్తున్న ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. నేను తమిళం, ఇంగ్లీషు మాట్లాడగలను. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. తెలుగులో కొన్ని పదాలు ఇష్టంగా అనిపిస్తాయి. అలాగే హిందీ, ఉర్దూ పదాలు బావుంటాయి.
* వైవిధ్యమైన, కొత్తతరహా పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. అలాంటి పాత్రలు ఖచ్చితంగా చేస్తాను. అయితే ఎంపిక చేసుకుంటున్న పాత్ర అందరికీ నచ్చేదేనా కాదా అన్నది చూస్తా.
* కనులు కనులను దోచాయంటే -అన్నది ఓ రొమాంటిక్ థ్రిల్లర్. ఇందులో మంచి ప్రేమ కథ ఉంటుంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్సూ ఉంటాయి. ప్రతి ఒక్కరికీ సినిమా కనెక్టవుతుందన్న నమ్మకముంది. ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిందని విన్నా. పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
* పర్ఫెక్ట్ ప్రాజెక్టును ప్లాన్ చేయడమంటే -గుడ్ రైటింగ్ స్క్రిప్ట్‌తో మొదలుపెట్టడం అనుకుంటా. అప్పుడే ఆ ప్రాజెక్టు ఔట్‌పుట్ మనం అనుకున్నట్టు వస్తుంది. రీమేక్స్‌కి నేను వ్యతిరేకిని. ఏ సినిమా చేసినా కొత్తగా ఉండాలని ఆరాటపడుతుంటా. అలాగే దర్శకుడిపై వున్న నమ్మకాన్ని బట్టి సినిమా అంగీకరించాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటా.
* తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు చేస్తావన్న ప్రశ్న చాలాకాలంగా ఎదుర్కొంటున్నా. ఈసారి ఆ టైం వచ్చేసిందనే అనిపిస్తోంది. ఏడాది చివరిలో స్ట్రెయిట్ తెలుగు సినిమా ఉండొచ్చు. ప్రస్తుతం మూడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ స్టేజ్‌లో ఉన్నాయి.