క్రైమ్/లీగల్

పెన్ను క్యాప్ మింగి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదిన్నె: పెన్ను క్యాప్ మింగి 2వ తరగతి విద్యార్థి యశ్వంత్(7) మృతి చెందాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తలపల్లికి చెందిన అశోక్‌కుమార్, చంద్రావతి దంపతుల కుమారుడు యశ్వంత్ అక్షర పాఠశాల హాస్టల్‌లో 2వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం యశ్వంత్ పెన్ను క్యాప్ మింగాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన టీచర్లు క్యాప్‌ను కక్కించే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే గార్లదిన్నెలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రికి చేరుకున్న బాలుని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

*చిత్రం... మృతి చెందిన యశ్వంత్