మళ్లీ.. చోర’గొన్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా తెలుగు సినిమా టైటిల్ వెరైటీ సౌండ్‌తో వినిపిస్తే -ఆ సినిమా పట్ల ఆడియన్స్ అటెన్షన్ సహజం. అందులోనూ వెరైటీగావుండే సినిమా టైటిల్ బయటికొస్తే -్ఫలానా హీరోది అయివుండొచ్చన్న అంచనాలూ అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. అలాంటివాళ్ల జాబితాలో హీరో శ్రీవిష్ణు పేరూ ఉంటుంది. విలువైన కథను ఎంపిక చేసుకోవడమే కాదు, పెర్ఫార్మెన్స్‌లోనూ వైవిధ్యాన్ని చూపాలన్న తపన శ్రీవిష్ణులో కనిపిస్తుంటుంది. అలాంటి హీరో నుంచి తాజాగా రానున్న ప్రాజెక్టు -రాజ రాజ చోర. ఇంతకుముందు శ్రీవిష్ణు చేసిన సినిమా టైటిల్సే కాదు, కథల్లోనూ వైవిధ్యాన్ని చూశాం. అప్పట్లో ఒకడుండేవాడు, ఉన్నది ఒకటే జిందగీ, నీది నాది ఒకే కథ, వీరభోగ వసంతరాయలు, బ్రోచేవారెవరురా, తిప్పరా మీసం.. ఇవీ శ్రీవిష్ణు చేసిన సినిమాలు, వాటి టైటిల్స్. వర్సటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటున్న శ్రీవిష్ణు బర్త్‌డే సందర్భంగా కొత్త ప్రాజెక్టు టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశాయి పీపుల్స్ మీడియా ప్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు. కొత్త దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్న ఆ చిత్రం -రాజ రాజ చోర. సునయిన హీరోయిన్. ఈ సందర్భంగా నిర్మాతలు టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ -శ్రీవిష్ణు, హసిత్ గోలిలాంటి ప్రతిభ కలిగిన వారితో సినిమా చేయటం హ్యాపీగా ఉంది. వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్‌నాటికి షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. తనికెళ్ల భరణి, రవిబాబు, అజయ్‌ఘోష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వేదరామన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.