అమ్మోరిగా నయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి చిత్రాల్లో అమ్మవారి పాత్రలంటే కేఆర్ విజయ, రమ్యకృష్ణే గుర్తుకొస్తారు. ఆ కోవలోకి మరో అగ్ర కథానాయిక కూడా చేరుతోంది. మూకుత్తి అమ్మన్ తమిళ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర గెటప్‌లో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను ఇటీవల చెన్నైలో విడుదల చేశారు. అమ్మవారి రూపంలో నయన్ నిండుగా కనిపిస్తోంది. ఆర్తె బాలాజీ, ఎన్‌జె శరవరణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నయన్ ప్రస్తుతం ఈ సినిమాతోపాటు నెట్రికన్, మరో సినిమాతో బిజీగా ఉంది.