13న శివన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకోట సాయితేజ, తరుణీసింగ్ జోడీగా ఎస్‌ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త దర్శకుడు శివన్ తెరకెక్కిస్తోన్న చిత్రం -శివన్. సంతోష్‌రెడ్డి లింగాల నిర్మిస్తోన్న లవ్ థ్రిల్లర్ ఇది. ది ఫినామినల్ లవ్ స్టోరీ అన్నది ట్యాగ్ లైన్. పోస్ట్ ప్రొడక్షన్స్ దశలోవున్న చిత్రాన్ని మార్చి 13న విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్రబృందం పేర్కొంది. యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలతోపాటు మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపుదిద్దుకున్నట్టు చెబుతున్నారు. అన్నివర్గాల పేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శివన్ -ఈ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. బడ్జెట్‌కు వెరవకుండా భారీగా తెరకెక్కించిన సినిమాను ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకం ఉందని నిర్మాత సంతోష్‌రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి మీరన్ కెమెరా, సిద్ధార్థ్ సదాశివుని సంగీతం సమకూరుస్తున్నారు.