నితిన్ హిట్టు.. నాకు హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీష్మ ప్రాజెక్టు డీటెయిల్స్ నాకు ముందే తెలుసు. సాంగ్స్‌ని నితిన్ ముందే చూపించాడు. సినిమా హిట్టవ్వాలని అప్పుడే కోరుకున్నా. భీష్మతో నితిన్ కొట్టిన హిట్.. నా సొంత సినిమా హిట్టుకంటే సంతోషాన్నిస్తోంది -అన్నాడు హీరో వరుణ్ తేజ్. నితిన్, రష్మిక జోడీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మకు సక్సెస్ అప్లాజ్ రావడంతో విశాఖపట్నంలో విజయోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు, యూనిట్ సభ్యులకు వరుణ్‌తేజ్, నితిన్, రష్మిక, వెంకీ కుడుముల జ్ఞాపికలు అందించారు. వరుణ్ తేజ్ నుంచి నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ జ్ఞాపికలు అందుకున్నారు. కార్యక్రమంలో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ -సాధారణంగా ఇండస్ట్రీలో సెకెండ్ సినిమా హిట్టుపడదన్న సెంటిమెంట్ ఉంది. అయితే, దర్శకుడు వెంకీ దాన్ని బ్రేక్ చేసి ఛలో తరువాత భీష్మతో హిట్టుకొట్టాడు. రష్మిక గ్రేట్ ట్రాక్‌లో ఉంది. వరుస హిట్లు కొట్టడమే కాదు, మంటి నటిగా టాలెంట్ చూపుతోంది. రష్మికతో కలిసి సినిమా చెయ్యాలని ఆశిస్తున్నా. ఇక నిర్మాత నాగవంశీ అల.. వైకుంఠపురములో చిత్రంలో పెద్ద హిట్టుకొట్టి ఇప్పుడు భీష్మతో మరో హిట్టందుకోవడం ఆనందకరమైన విషయం. భీష్మ టీంకి అభినందనలు. రిపీటెడ్ ఆడియన్స్‌తో భీష్మ మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నా అన్నారు. హీరో నితిన్ మాట్లాడుతూ -సక్సెస్ మీట్‌కు ఆరడుగుల బుల్లెట్ పవన్ రాలేకున్నా, ఆరడుగుల నాలుగంగుళాల బుల్లెట్ వరుణ్ తేజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. భీష్మ హిట్టవ్వడం పట్ల పవన్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాత నాగవంశీతో అఆతో హిట్‌కొట్టాను. ఇప్పుడు భీష్మతో మరో హిట్టునిచ్చారు. నాలుగేళ్ల తరువాత నాకు వచ్చిన హిట్టింది. అందుకు కృషి చేసిన నిర్మాత, దర్శకుడు వెంకీకి థాంక్స్. రష్మిక మంచి పెర్ఫార్మర్. మా ఫస్ట్ కాంబో హిట్టవ్వడం హ్యాపీగా ఉంది. భీష్మను హిట్ చేసిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు అన్నారు. హీరోయిన్ రష్మికా మండన్న మాట్లాడుతూ -నితిన్, వెంకీ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లతో కలిసి పనిచేసిన భీష్మను హిట్ చేసిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. ఈ విజయం చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. నిర్మాత నాగవంశీ మరిన్ని లాభాలు ఆర్జించాలని ఆశిస్తున్నా అన్నారు. కాసర్ల శ్యామ్, ఫైట్ మాస్టర్ వెంకట్, నటుడు సంపత్‌రాజ్ తదితరులు మాట్లాడారు.