నన్ను నేను మలచుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస చిత్రంలో శ్రీకాకుళం మాండలికం మాట్లాడాలి. రోజంతా అదే యాసలో మాట్లాడేవాణ్ని. అలా ఈ చిత్రంలో మోహన్‌రావు పాత్రకోసం నన్ను నేను మలచుకున్నా అంటున్నాడు హీరో రక్షిత్. కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జోడీగా రూపొందిన చిత్రం -పలాస 1978. 6న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో రక్షిత్ మీడియాతో మాట్లాడాడు.
* లండన్‌బాబులు చిత్రం తరువాత ఏదైనా డిఫరెంట్ సినిమా చేయాలనుకున్నా. రెగ్యులర్ లవ్‌స్టోరీలు కాకుండా కొత్త నేపథ్యమున్న కథలకోసం వెతుకున్న టైంలో ఇది దొరికింది. ఈ కథ నాలుగు వేరియేషన్స్‌లో కనిపించాలి. ఆ ఛాలెంజ్ నచ్చి కథను ఎంపిక చేసుకున్నా.
* ముందుగా 60 ఏళ్ల వృద్ధుడి గెటప్ షూట్ చేశారు. ఆ పాత్ర కోసం బరువు తగ్గడం, పెరగడం చేశాను. నాలుగు వేరియేషన్స్ బాగా చేశాననే అంటున్నారు. నటుడిగా ఇలాంటి చాన్స్ అరుదుగా వస్తుంది. అది నాకు రావడం హ్యాపీ.
* దర్శకుడు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కథ సిద్ధం చేశాడు. కథలో పాత్ర కోసం డప్పుకొట్టడం ప్రాక్టీస్ చేశా. టీమ్ మొత్తం ఎంతో ఎఫర్ట్ పెట్టింది. 40 రోజులపాటు పలాసలో సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేశాం.
* పక్కాగా జరిగిన ప్రీ ప్రొడక్షన్‌తోనే సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయగలిగాం. పోస్ట్ ప్రొడక్షన్‌లోనూ తగిన జాగ్రత్త తీసుకున్నాం. నిజానికి షూటింగ్ కంటే, పోస్ట్ ప్రొడక్షన్స్‌కే ఎక్కువ టైం తీసుకున్నాం. సినిమా అనుకున్నప్పటినుంచీ పలాస తప్ప మరో ఆలోచన లేదు.
* షూటింగ్‌లో ఎదురైన ఇబ్బందులన్నీ దాటి ఇపుడు పరిశ్రమ ఈ సినిమా గురించి మాట్లాడుకునేదాకా వచ్చాం. అందుకు దర్శకుడే కారణం. ఈ సినిమా చూసినోళ్లు నా నటన గురించి మాట్లాడుతోంటే హ్యాపీగా ఉంది. పలాస అనేది అసురన్ తరహా సినిమా. కెరీర్‌లో ఇలాంటి సినిమా చేస్తాననుకోలేదు. 6న థియేటర్‌కు వస్తున్న మమ్మల్ని ఆడియన్స్ ఆదరించాలని రిక్వెస్ట్.