కొడుకే తండ్రిని చదివిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిసంతోష్, రాహుల్ విజయ్, ప్రియా వడ్లమాని, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం -కాలేజీ కుమార్. ఎంఆర్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం 6న విడుదలవుతోంది. కాగా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. నటులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ -ఈ ఏడాదిలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు హిట్ అయినట్టుగా నేను నటించిన ఈ సినిమా కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నా. సెకెండాఫ్‌లో నవ్వలేక ఆడియన్స్ పొట్టలు చెక్కలవుతాయి. హరి దర్శకుడిగా తన ప్రతిభ చూపాడు. తనకున్న పరిమిత వనరులతోనే అద్భుతమైన కంటెంట్‌ను సినిమాలో చెప్పాడు. ఒక తండ్రిని కొడుకు ఎందుకు చదివించాడు? అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అనేది గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాయింట్‌తోనే ప్రేక్షకులను ఇంట్రెస్ట్‌గా కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. విషయం సీరియస్‌గావున్నా చెప్పే విధానం హాయిగా వుంటుందన్నారు. హీరో రాహుల్ మాట్లాడుతూ -చదవడం గొప్పా? చదివించడం గొప్పా? అనే లైన్ తండ్రీ కొడుకులమధ్య వచ్చే సంఘర్షణని దర్శకుడు వైవిధ్యంగా తీర్చిదిద్దాడు. నా కెరీర్‌కు ఈ సినిమా ఓ మెమరబుల్ అన్నారు. మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ని సినిమాలో రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేశారని, 6న విడుదలవుతున్న సినిమా అందరికీ నచ్చుతుందని కథానాయిక ప్రియ వడ్లమాని అన్నారు. కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ విజయన్, హీరో గోపీచంద్, దర్శకుడు గోపీచంద్ మలినేని, దర్శకుడు హారీ, రామ్-లక్ష్మణ్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.