మనసు మాట.. అఖిల్ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తున్న చిత్రం -మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గీతా ఆర్డ్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తోన్న సినిమా. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్న ప్రాజెక్టు నుంచి తాజాగా ఫస్ట్ వీడియో లిరికల్ వదిలారు. ‘మనసా మనసా మనసారా బతిమాలా.. తన వలలో పడబోకే మనసా’ అంటూ సాగే పాటను సిద్ శ్రీరామ్ తనదైన స్టయిల్లో ప్రజెంట్ చేశాడు. ప్రేమలో విఫలమైన తరువాతో, లేదా ప్రేమలో పడొద్దంటూ తన మనసును వారిస్తూనో హీరో పాడుకునే పాటలా ఉంది. రొమాంటిక్ టచ్‌తో కూడిన క్లాసిక్ మెలోడీలా పాట వినసొంపుగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా భాస్కర్ ఈ కథను ప్రజెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హీరో అఖిల్‌కి, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కీ -ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిన అనివార్య స్థితి. సో, -ప్రాజెక్టుపై పూర్తి ఫోకస్‌తో పని చేస్తున్నట్టే కనిపిస్తోంది.