6న వస్తోన్న కృష్ణమనోహర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుదేవా మల్టీ టాలెంట్స్‌ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా, ఆర్టిస్టుగా భిన్నమైన సినిమాలు చేసిన ప్రభుదేవా -తాజాగా కృష్ణమనోహర్ ఐపీఎస్‌గా మార్చి 6న థియేటర్లకు వస్తున్నాడు. కెరీర్‌లో ఫస్ట్‌టైం పోలీస్ కాప్ పాత్ర చేస్తోన్న ప్రభుదేవా తమిళ చిత్రం ‘పొన్ మానికవల్’. ఈ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌ను తెలుగులో పవన్‌పుత్ర ప్రొడక్షన్స్‌పై యనమల సుధాకర్ సమర్పణంలో నిర్మాత ఆర్ సీతారామరాజు ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’గా విడుదల చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభుదేవాతో డస్కీ బ్యూటీ నివేదా పేతురాజ్ రొమాన్ చేసింది. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. సిన్సియర్ పోలీస్ కాప్ పాత్రలో ప్రభుదేవా పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉందని, ఈ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ని పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తాడన్న నమ్మకముందని నిర్మాత సీతారామరాజు అంటున్నారు. యూనిఫాంతో థియేటర్లలో ప్రభుదేవా ఎలాంటి హడావుడి చేస్తాడో చూడాలి.