ఇరవైల నుంచి అరవైల వరకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు కరుణకుమార్ ఈ స్టోరీ చెప్పేదాకా ఇలాంటి కథలు, మనుషులు, పాత్రలు ఉంటాయని నాకు తెలియదు. 20 ఏళ్ళనుండి 60 ఏళ్ళ వృద్ధుడివరకు వున్న జర్నీని చిత్రంలో వైవిధ్యంగా చిత్రీకరించే ప్రయత్నం దర్శకుడు చేశాడని కథానాయకుడు రక్షిత్ తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం -పలాస 1978. రక్షిత్, నక్షత్ర హీరోయన్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో పలు విశేషాలు చెబుతూ- సినిమాలో ప్రతి డైలాగ్ ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రేక్షకులు క్లాప్స్ కొట్టడం ఖాయమని తెలిపారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రఘు కుంచె వైవిధ్యంగా అందించారని, ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్‌గా ఆస్వాదిస్తారని ఆయన అన్నారు. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ- పలాస నా మొదటి సినిమాగా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అయినా కొత్త తరహా కథలు కావాలని నిర్మాత అడగడంతో ఈ కథను ఎంచుకున్నాం. ఓ ఎమోషనల్ జర్నీగా సినిమా సాగుతుంది అని తెలిపారు. ఈ నెల 6న విడుద లకానున్న ఈ చిత్రం తెలుగు సినిమా కథలు మళ్లీ మూలాలవైపు అడుగులు వేస్తున్నాయి అనడానికి నిదర్శనంగా నిలవబోతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో యువ హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణు, దర్శకుడు మారుతి, కల్యాణిమాలిక్, భాస్కర్‌భట్ల, తమ్మరెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.