కీర్తి కుట్టి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీర్తి సురేష్ మంచి నటి. సావిత్రి జీవిత కథలో పాత్ర పోషించాక -‘మహానటి’ అనిపించుకుంది. సంస్కారవంతమైన గ్లామర్‌తోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ కీర్తి -పతాకమెగరేస్తోంది. మహానటి సినిమాతో విమర్శకులనూ మెప్పించిన కీర్తిసురేష్ -ఏదైనా ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తోందంటే దానికో ప్రత్యేకత ఉండే ఉంటుందన్నంత ఇమేజ్ తెచ్చుకుంది. కీర్తిని ఈ స్టిల్‌లో చూస్తుంటే -ఈ సినిమాలో ఆమె చేస్తోన్న పాత్రకేదో ప్రత్యేకత ఉండే ఉండాలి అనిపిస్తోంది కదూ. వర్సటైల్ ఆర్టిస్టు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో మలయాలంలో తెరకెక్కుతోన్న చిత్రం -మరక్కర్: అరబికదలింతే సింహం. ఇందులో కీర్తిసురేష్ మలయాళ కుట్టి ఆర్చగా కనిపించనుందట. మహానటి కోసం ఎంతగా కష్టపడ్డానో.. మాతృభాషలో నేను చేస్తోన్న మరో పాత్ర కోసమూ అంతే కష్టపడుతున్నా’నంటూ -కీర్తి ఇలా స్టన్నింగ్ లుక్కిచ్చింది. ఆమె పాత్ర లుక్‌ని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. అసలే మలయాళీ పిల్ల. ఆపై సంస్కృతీ సంప్రదాయాన్ని వంటబట్టించుకుని పెరిగిన నేటి యువతి. అందుకే ట్రెడిషినల్ అప్పియరెన్స్‌కి కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చి -నేటి మలయాళీ కుట్టినంటూ ఇలా ఫోజిచ్చి సోషల్ మీడియాలో వైరలవుతోంది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది.