గంగపుత్రుల కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమాకాంత్, భానుశ్రీ, అవంతిక హీరో హీరోయిన్లుగా దర్శకుడు నగేష్ నారదాసి తెరకెక్కిస్తోన్న చిత్రం -సముద్రుడు. కీర్తన ప్రొడక్షన్స్‌పై బదావత్ కిషన్, శ్రీరామోజు జ్ఞానేశ్వర్, సోములు నిర్మిస్తోన్న చిత్రమిది. హీరో రమాకాంత్ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్‌లో దర్శకుడు వి సముద్ర చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సముద్ర మాట్లాడుతూ -రమకాంత్ నా సినిమాలు అన్నింటిలో నటించాడు. నాపైవున్న అభిమానంతో నా పేరునే టైటిల్ చేస్తాడనుకోలేదు. భానుశ్రీ నటించిన సినిమాలన్నింటికీ ఓపెనింగ్స్ బాగుంటాయి. ఈ సినిమా కూడా అలానే ఉంటాలనుకుంటున్నా. ఇక దర్శకుడు నగేష్ టాలెంట్‌వున్న పర్సన్. పాజిటివ్ టైటిల్‌తో యూనిట్ మొత్తానికి మంచి పేరు తెచ్చే సినిమా తీస్తున్నాడనే భావిస్తున్నా అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ -నా కూతురు కీర్తన పేరు మీద ప్రొడక్షన్ మొదలుపెట్టాం. బేస్తవారి జీవన శైలితో తీసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ ఈ కంటెంట్‌ను ఎవరూ టచ్ చేయలేదనే అనుకుంటున్నా. కష్టపడి సినిమా చేశాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు. హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ -నరసింహాలో రమ్యకృష్ణ పాత్రలాంటి పాత్ర చేశా. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు నగేష్‌కు కృతజ్ఞతలు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -టైటిల్, స్టోరీ నచ్చి సినిమా చేశాం. హైదరాబాద్, చీరాలలో షూటింగ్ పూర్తి చేశాం. నెలాఖరులో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు. దర్శకుడు నగేష్ మాట్లాడుతూ -క్రౌడ్, ప్యాడింగ్ ఎక్కువగా ఉన్న సినిమా ఇది. ఒక ఊళ్లో చేపలుపట్టేవారి జీవన శైలి కథాంశం. ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. పక్కా కమర్షియల్ చిత్రం సముద్రుడు అన్నారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం, వాసు సినిమాటోగ్రఫీ సమకూర్చారు.