మొదలైన దక్షయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కసూర్తి ఫిలిమ్స్, హంస క్రియేషన్స్‌పై దర్శకుడు తోట కృష్ణ తెరకెక్కించనున్న చిత్రం -దక్షయజ్ఞం. మెట్రో స్టూడియోస్ అధినేత ఈవీఎన్ చారి సారథ్యంలో మహతి సాయి జస్వంత్ సమర్పిస్తోన్న చిత్రమిది. నార్సింగ్ శివాలయం దగ్గర ఫామ్‌హౌస్‌లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మాత చిన్న శ్రీశైలం యాదవ్ క్లాప్‌నిస్తే, బుర్ర జ్ఞానేశ్వర ముదిరాజ్ కెమెరా స్విచాన్ చేశారు. ముఖ్య అతిధిగా మజ్జిగ సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ -దక్షయజ్ఞం ఖాయంగా విజయం సాధించే సినిమా. ఆత్మీయుడు ఈవీఎన్ చారితో కలిసి నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. మరో నిర్మాత జ్ఞానేశ్వర ముదిరాజ్ మాట్లాడుతూ -యూత్ ఆశించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిర్మిస్తోన్న సినిమా ఇది అన్నారు. ఈవీఎన్ చారి మాట్లాడుతూ ఇప్పటి వరకూ 8 సినిమాలు నిర్మించాను. కొత్త ఏడాదిలో 9వ సినిమా నిర్మాణానికి పూనుకోవడం హ్యాపీగా ఉంది. ఇదొక డిఫరెంట్ సినిమా. దర్శకుడు తోట కృష్ణ పనితనంపై నమ్మకంతో నిర్మిస్తున్నాం. మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకముంది అన్నారు. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ -మెట్రో స్టూడియోస్ నాకు మాతృసమాన సంస్థ. ఈవీఎన్ చారితో ఉన్న అనుబంధంతో ఇప్పటికి ఆరు సినిమాలు డైరెక్ట్ చేశా. దక్షయజ్ఞం -ది టార్గెట్ అన్నది యాక్షన్, లవ్, సస్పెన్స్ థ్రిల్లర్. ఆడియన్స్‌కి కనెక్టయ్యే కథపై పూర్తి నమ్మకంతో ఉన్నాం అన్నారు.