పేరుకే.. పిట్ట కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు, నిత్యశెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం -ఓ పిట్ట కథ. భవ్య క్రియేషన్స్‌పై వి ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన చిత్రానికి దర్శకుడు చెందు ముద్దు. 6న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో విశ్వంత్ మాట్లాడాడు.
ఈ కథలో హీరోగా..?
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ‘మనమంతా’లో హీరోగా చేశా. అలా ఆయనతో జర్నీలో భాగంగా ఓసారి చెందు ముద్దు చెప్పిన కథ గురించి ప్రస్తావించారు. తను చెప్పిన కథ బావుంది, చేస్తావా? అన్నారు. యేలేటిమీద నాకు అపారమైన నమ్మకం. అందుకే -కథ మీరు వింటే.. బావుందనిపిస్తే చేస్తా అన్నాను. నాకు నమ్మకమైన దర్శకుడు యేలేటి చెప్పారు కనుక -కథ కూడా వినకుండా ఒప్పుకున్న సినిమా ఇది.
నిజానికి ఓ పిట్ట కథ అన్న టైటిల్‌నుంచే
-స్క్రీన్ ప్లే గేమ్ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో వస్తోన్న
తెలుగు సినిమాల్లో ఇదొక బెస్ట్ స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ
అన్న నమ్మకంతో చేశా. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సినిమా కనుక
-ఓ పిట్ట కథ అన్న సింపుల్ టైటిల్ యాప్టనిపించి పెట్టారు.
పైగా స్క్రీన్ ప్లేలో డిఫరెంట్ డైమన్షన్స్, ప్రతి పాత్రకూ ఓ పిట్ట కథ ఉండటం.. వీటి కోణంలో చూస్తే
ఈ పిట్ట కథ వెనుక పెద్ద పరమార్థమే ఉంటుంది.
కథలో ప్రత్యేకత?
సరైన కథలు నాకు రావడం లేదు, ఒక పర్ఫెక్ట్ సినిమా చెయ్యాలన్న తపన యేలేటి దగ్గర వ్యక్తం చేస్తుండేవాడిని. ఈ కథను నాకు సజెస్ట్ చేయడంలో ప్రధాన కారణం -స్క్రీన్‌ప్లే అనుకుంటున్నా. స్క్రీన్ ప్లేపై యేలేటికి మంచి పట్టుంది. ఈ కథలో ఇన్‌బుల్ట్‌గావున్న స్ట్రీన్ ప్లే స్టయిల్ నచ్చి నాకు సజెస్ట్ చేశారనుకుంటున్నా. సో, ఇది అందరికీ నచ్చే ప్రత్యేక కథే అవుతుంది.
థ్రిల్లింగ్ ఎలిమెంట్?
చాలా ఉంటాయి. వాటిని డిస్కస్ చేసేకంటే -స్క్రీన్ మీద చూస్తున్నపుడు కలిగే ఫీల్ అద్భుతమే. ముఖ్యంగా నా పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయి. ఇలాంటి పాత్ర నాకు దొరకడం కెరీర్‌కు పెద్ద ప్లస్.
కెరీర్ జర్నీ..?
చాలా హ్యాపీగా శాటిస్‌ఫాక్షన్‌తో ఉన్నా. చేసినవన్నీ మంచి సినిమాలే. ఆర్టిస్టుగా మంచి పేరే తెచ్చాయి. కాకపోతే, కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్నా. ‘మనమంతా’లాంటి ఒక్క సినిమా చాలు, నా కెరీర్‌ని గౌరవంగా చెప్పుకోడానికి.
దాని కోసమే..?
ఎన్ని మంచి సినిమాలు చేసినా -దానికో కమర్షియాలిటీ దక్కినపుడు వచ్చే ఇమేజ్ వేరుంటుంది. ఆర్టిస్టుగానూ సెపరేట్ ట్రాక్‌లోకి తీసుకెళ్తుంది. నేనూ, అలాంటి కమర్షియల్ బ్రేక్ త్రూ కోసం చూస్తున్నా. ఈమధ్యే ‘కాదల్’ అని ఒక సినిమా చేశా. ఆ సినిమా నన్ను కమర్షియల్ ట్రాక్‌లోకి తీసుకెళ్తుందన్న నమ్మకముంది.
నెక్ట్స్ ప్రాజెక్టులు?
‘కాదల్’ విడుదల కావాల్సి ఉంది. ‘బోయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో ప్రాజెక్టు షూటింగ్ జరుగుతోంది. రెండూ -కమర్షియల్ యాంగిల్లో నడిచే ఎమోషనల్ కంటెంట్లే. వాటితో హీరోగా పూర్తి లైమ్‌లైట్‌లోకి వస్తాననే అనుకుంటున్నా.