వినయమే.. నా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయం, భక్తి, ఎదుటివాళ్లకు మర్యాద, నిర్మాత ఇచ్చే రూపాయికి విలువ గుర్తెరిగితే -ఎంతకాలమైనా పరిశ్రమలో కొనసాగొచ్చు. నాటకాల నుంచి సినిమాలకు వచ్చినపుడు అదే తెలుసుకున్నా. అదే పాటిస్తున్నా. అందుకే -ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నా -అంటోంది అన్నపూర్ణమ్మ. తొలినాళ్లలో ఒకట్రెండు హీరోయిన్ పాత్రలు చేసినా -తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలూ చేశారు అన్నపూర్ణ. మాస్టర్ రవితేజ, అన్నపూర్ణ ప్రధాన పాత్రలుగా నిర్మాత ఎంఎన్‌ఆర్ చౌదరి నిర్మించిన -అన్నపూర్ణమ్మగారి మనవడు సినిమా వస్తోంది. దర్శకుడు శివనాగు తెరకెక్కించిన సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో బుధవారం ఆమె మీడియాతో ముచ్చటించారు.
* ఒక ఊళ్లో కొన్ని కుటుంబాల కథ ఇది. నేనెవరో తెలిసి నా మనవడు ఇంటికొస్తాడు. ఇంట్లోవాళ్ల కారణంగా బయటకు వెళ్లిపోతాడు. వాడే నా మనవడని నాకు తరువాత తెలుస్తుంది. ఆ తరువాత ఏమైందో భావోద్వేగాలతో సాగే కథలో చూడాలి. అన్నపూర్ణమ్మగారి మనవడు -మన కథ. మన లొకేషన్స్‌లో తీసిన సినిమా. జీవా, బెనర్జీ, జమున, సుధ, అర్చన.. ఇలా చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కించిన సినిమా. ప్రేక్షకులకు నచ్చుతుంది.
* నా పేరుమీద టైటిల్ పెట్టడంతో -ఈ సినిమాకు సంబంధించి కాస్త బాధ్యత, భయం ఎక్కువనిపించింది. సినిమా విడుదలయ్యే వరకూ టెన్షన్ తప్పదేమో. ఇప్పుడొస్తున్న దర్శకులు చిన్న పిల్లలే అయినా -కథపరంగా పాత్రలపై వాళ్లకో విజన్ ఉంటుంది. అందుకే -పాత్ర గురించి విన్నాక దర్శకుడు చెప్పినట్టే చేస్తా. లేదూ ‘మీరు చేయండి’ అని దర్శకుడు స్వేచ్ఛనిస్తే అర్థం చేసుకుని చేస్తాను. అతిగా జోక్యం చేసుకోను.
* నేనొచ్చినప్పటికీ, ఇప్పటికీ ఇండస్ట్రీలో గమనించిన మార్పు ఒక్క ఆర్థికరూపంలోనే. వేరొకరు చేసిన పాత్రలపై ఆశపడను. నాకొచ్చే పాత్రలపట్ల నిర్లక్ష్యం చూపించను. అవార్డులు, రివార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ‘అమ్మా’ అంటూ ఇండస్ట్రీలో అందరూ నన్ను గౌరవిస్తారు. తొమ్మిదేళ్ల ఈ జనరేషన్ పిల్లలకూ అన్నపూర్ణమ్మ తెలుసు. అంతకంటే గొప్ప గుర్తింపు ఏముంటుంది?
* కొత్తవాళ్లతో పని చేస్తున్నపుడు -నేను సీనియర్ అనుకోను. పాత్రల మధ్య సమతుల్యత కోసం వాళ్లతో సమానంగా నటించాలనే ఆలోచిస్తా. పాత్రలు మ్యాచ్ కాకపోతే సీన్ చెడిపోతుందని భయం. సినిమాలకు వచ్చిన దగ్గర్నుంచీ వ్యక్తిగత జీవితానికీ ప్రాధాన్యత ఇవ్వలేనంత బిజీగానే ఉన్నా. ఇప్పుడూ 3 సినిమాలు చేస్తున్నా. మరో రెండు కన్ఫర్మ్ కావాల్సి ఉంది.
* జనరేషన్స్ మారుతున్నా అదే అభిమానం, వాత్సల్యం ఇండస్ట్రీలో నాకు దక్కడాన్ని చూస్తే -నేను చాలా అదృష్టవంతురాలిని.