రెడ్‌లో హెబ్బా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమారి 21ఎఫ్‌తో కుర్రకారుకి దగ్గరైన హెబ్బాపటేల్ -ఆ తరువాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. వచ్చిన కొద్దిపాటి చాన్స్‌లూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ చూపించినా ఫలితం లేకపోయంది. ఈమధ్యే విడుదలైన భీష్మలో ‘స్పెషల్ సెక్సీ అప్పియరెన్స్’తో కుర్రాళ్లను ఆకట్టుకున్న హెబ్బా -ఇప్పుడు రామ్ ‘రెడ్’తో మరో సెక్సీ గాలం వేయబోతోందట. రామ్ హీరోగా రూపొందుతోన్న రెడ్ చిత్రంలో హెబ్బా స్పెషల్ ఐటెం చేయబోతోందన్నది తాజా అప్‌డేట్. రామ్‌కు జోడీగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ ఉన్నప్పటికీ, సినిమాకు సెక్సీ టచ్‌నిచ్చే వెపన్‌గా హెబ్బాను ప్రయోగిస్తున్నారని అంటున్నారు. సెకెండాఫ్‌లో వచ్చే మాస్ సాంగ్‌లో హెబ్బాపటేల్ అందాలు విందు చేయనున్నాయన్నది ఇన్‌సైడ్ టాక్. హీరోయిన్‌గా చాన్స్‌లు లేకపోవడంతో -తెరమరుగైపోకుండా ఉండేందుకు సైడ్ క్యారెక్టర్లు, స్పెషల్ సాంగ్స్‌తో కెరీర్‌ను నడిపిస్తోంది హెబ్బా. ఇదికాకుండా విజయ్ కొండా దర్శకత్వంలో ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రంలోనూ హెబ్బా సెకెండ్ హీరోయిన్ పాత్ర చేస్తోంది.