13న ప్రేమపిపాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్లుగా మురళీ రామస్వామి (ఎంఆర్) తెరకెక్కిస్తోన్న చిత్రం -ప్రేమపిపాసి. ఎస్‌ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్‌పై రాహుల్‌భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి పిఎస్ రామకృష్ణ (ఆర్‌కె) నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా మార్చి 13న భారీఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పిఎస్ రామకృష్ణ మాట్లాడుతూ -ప్రేమపిపాసి సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు సినిమాకు మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. బిజినెస్ పరంగా అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం మరింత హ్యాపీ అన్నారు. సహనిర్మాత రాహుల్ పండిట్ మాట్లాడుతూ -దర్శకుడు మారుతి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు, సినిమాకు క్రేజ్ తెచ్చింది. ఈ సినిమా ఆడియన్స్‌ని పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు. హీరో జీపీఎస్ మాట్లాడుతూ -ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచీ సినిమాపై ఇండస్ట్రీలో బజ్ పెరగడం హ్యాపీ. సినిమా రిలీజ్ ఎప్పుడు? అంటూ వస్తున్న ఫోన్లు ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇప్పుడు సెన్సార్ టీం సైతం మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం మా నమ్మకం మరింతైంది. ప్రేమపిపాసిని బ్లెస్ చేయండి అన్నాడు. దర్శకుడు మురళి రామస్వామి మాట్లాడుతూ లవ్‌ని కమర్షియల్ కంటెంట్‌గా చూస్తున్న న్యూ ఏజ్ జనరేషన్‌కు.. జెన్యూన్ లవ్ ఎలా ఉంటుందో చూపించే సినిమా -ప్రేమపిపాసి. విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో -మిగిలిన పాటలనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాతల సహకారంతో సినిమా అద్భుతంగా వచ్చింది. హీరో జీపీఎస్ తన పాత్ర కోసం పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుందనే అనుకుంటున్నా అన్నారు. ఈ సినిమాకు తిరుమల రోడ్రిగ్జ్ సినిమాటోగ్రఫీ, ఆర్స్ సంగీతం సమకూర్చారు.