అక్కడుండే.. థ్రిల్లే వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనులు కనులను దోచాయంటే ఓటిటి, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూసే సినిమా కాదు. థియేటర్స్‌లో చూస్తున్నపుడు కలిగే థ్రిల్లే వేరు. నేను కూడా సినిమాను థియేటర్‌లోనే సింగిల్‌గా చూశా. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు, ఓటిటిలో వస్తుందని వెయిట్ చేయకండి అని కథానాయకుడు దుల్కర్ సల్మాన్ తెలిపారు. తమిళంలో కణ్ణుమ్ కణ్ణుమ్ కుళ్లయడిత్తాగా రూపొంది తెలుగులో కనులు కనులను దోచాయంటే అన్న పేరుతో అనువాదమైన చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ, రక్షణ్, నిరంజని, అనీష్ కురువిల్లా ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. కథానాయకుడు దుల్కర్ మాట్లాడుతూ- సినిమాలో డిఫరెంట్ షేడ్స్ వున్న కారెక్టర్‌లో రీతూవర్మ చక్కగా నటించిందని, నా పాత్ర సినిమా మొదటినుండి చివరివరకూ ఒకేలా వుంటుందని, దర్శకుడు దేసింగ్ పెరియసాని హార్డ్‌వర్క్‌కి అందిన విజయమని అన్నారు. తెలుగులో చాలా రోజుల తరువాత మంచి సినిమాతో తాను ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా వుందని, వౌత్ టాక్‌తో కలెక్షన్లు పికప్ అవుతున్నాయని, కంటెంట్ బాగుంటే సినిమా విజయవంతం అవుతుందన్న మాట మరోసారి నిరూపణ అయిందని కథానాయిక రీతూవర్మ అన్నారు. కమర్షియల్ సినిమాల్లో కథానాయికకు నటించే అవకాశం వున్న పాత్రలు లభించడం తన అదృష్టమని ఆమె అన్నారు. భాస్కరన్ ఫొటోగ్రఫి సినిమాకు ప్లస్ పాయింట్ అని, ఈ సినిమాకోసం దర్శకుడు ఐదేళ్లపాటు కష్టపడ్డారని, రక్షణ్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. కథ నచ్చడంతో కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి హక్కులు తీసుకున్నామని, అండర్‌డాగ్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాదరణతో కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించిందని, రోజురోజుకీ వసూళ్లు పెరగడం ఆనందాన్నిస్తోందని ఆయన అన్నారు.
మల్టీజోనర్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి రైటింగ్, కాస్టింగ్ వుంటేనే సినిమా సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్‌గా నిలిచిందని, దర్శకుడిగా ఇటువంటి సినిమా రాయడం, తీయడం కష్టమని కేరెక్టర్ నటుడు అనీష్ కురువిల్లా తెలిపారు. పెళ్లిచూపులు, భరత్ అను నేను చిత్రాల తరువాత ఓ మంచి సినిమాలో నటించిన తృప్తి మిగిలిందని ఆయన అన్నారు.