యంగ్ కాదు.. హెల్దీగా వున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్‌రావు, నిత్యశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన తారాగణంగా భవ్య క్రియేషన్స్‌పై వి ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం -ఓ పిట్ట కథ. కొత్త దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కించిన చిత్రం 6న థియేటర్లకు వస్తోంది. కథలో కీలకమైన ఇనె్వస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర పోషించిన బ్రహ్మాజీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఓ పిట్ట కథలో మా అబ్బాయి సంజయ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నాడు. పిల్లలపై అందరు ఫాదర్లు చూపించే కన్సర్నే నేనూ చూపించా. అందుకే నేనున్న క్రియేటివ్ ఫీల్డ్‌కి వచ్చాడేమో.
ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్నాను కనుక -సంజయ్‌ని సోలో హీరోగా పరిచయం చేయొచ్చు. కానీ, మంచి పాత్ర చేస్తే ఆడియన్స్‌కి ఎక్కువ గుర్తుంటామని నమ్ముతా. అందుకే -పిట్టకథలో పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నా.
క్రియేటివ్ ఫీల్డ్‌కి వస్తానని సంజయ్ నాతో అన్నపుడు -ట్రై చెయ్యమన్నాను. వర్కౌటేతే సరే, లేదంటే నచ్చింది చేద్దువుగాని అనే చెప్పా. తనకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకుంటున్నాడు కనుక -్ఫదర్‌గా ఏం చేయాలో అదే చేస్తున్నా.
నిజానికి మా అబ్బాయి చేస్తున్నాడని కాదుకానీ, ఇదొక మంచి కంటెంట్‌తో వస్తున్న సినిమా. అలాంటి సినిమా ఎక్కువమంది ఆడియన్స్‌కి రీచవ్వాలనే -నాకున్న పరిచయాలను వాడాల్సి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ స్టాల్‌వాల్ట్స్ పిట్టకథకు ఇచ్చిన ప్రోత్సాహంతో -చాలామంది ఆడియన్స్‌కి రీచైందనే భావిస్తున్నా.
ఇక సినిమాలో నా పాత్ర- ఓ ఇనె్వస్టిగేషన్ ఆఫీసర్. ఒక అమ్మాయి మిస్సింగ్ కేసును వివిధ కోణాల్లో ఇనె్వస్టిగేట్ చేస్తుంటా. పాత్ర సీరియస్‌గానే ఉంటుంది.
నిజానికి ఇదొక షార్ట్ ఫిల్మ్. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిలాంటి హితుల సజెషన్స్‌తో -్ఫచర్ ఫిల్మ్‌గా మారింది. కథను బలోపేతం చేయటంలో ఆయన సలహాల పాత్ర చాలా ఉందనే చెబుతా. దర్శకుడు చెందు ముద్దు అంతకుమించి కష్టపడ్డాడు. ఇదొక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. డిఫరెంట్ డైమన్షన్స్‌లో స్క్రీన్ ప్లే సాగుతుంటే -థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కథలో భాగంగా ఉంటాయి. తెలుగులో వస్తున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ అని గట్టిగా చెబుతా.
ఓ పిట్ట కథను నా ఫ్రెండ్స్, డైరెక్టర్స్ కృష్ణవంశీ, అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి వీళ్లంతా చూశారు. వాళ్లందరికీ సినిమా నచ్చింది. సో, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
వయసొచ్చినా యంగ్‌గా కనిపిస్తున్నానని చాలామంది అంటుంటారు. బట్, నేను హెల్దీ అనుకుంటా. అమ్మానాన్న ఇచ్చిన జీన్స్ ప్రభావమై ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి -పొద్దునే్న వ్యాయామం చేస్తా. మంచి డైట్ తీసుకుంటా. నెగెటివిటీకి దూరంగావుంటా. సలహా అడిగితే -పాటించేదే చెబుతా. అందుకే నేను హెల్దీ. ఇండస్ట్రీలో అందరితో రిలేషన్స్ వెరీ హెల్దీ.
ఇండస్ట్రీలో ఉన్నవాళ్లంతా మంచోళ్లే. హీరోలమధ్య
స్నేహ సుహృద్భావముంది. వ్యక్తిగత జీవితాల్లోనూ బలమైన రిలేషనే్స ఉంటాయి. ఇది అర్థంకాక బయటి వ్యక్తులే ఏదేదో అనుకుంటారు. సీనియర్‌గా నేను చెప్పే మాట ఒక్కటే. ఎవరిమీదైనా అభిమానం పెంచుకోవచ్చు.
అది మరొకరిపట్ల దురభిమానం కాకూడదు.