హీరోయిన్ల హీరోయిజమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా -హీరోలతో ఎంటర్‌టైన్‌మెంట్ కథల్ని తెరకెక్కిస్తుంటారు. అలాంటి సినిమాల్ని ఆడియన్స్ చూసేశారు. అందుకే హీరోయిన్లనే హీరో పాత్రలుగా మలచి ఎంటర్‌టైన్‌మెంటే సినిమా చేశా. అదే అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అంటున్నాడు -దర్శకుడు బాలు అడుసుమిల్లి. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై ధన్య బాలకృష్ణ, సిద్దీ ఇద్నాని, త్రిధాచౌదరి, కోమలి లీడ్‌రోల్స్‌లో హేమ వెలగపూడి రూపొందించారు. 7న సినిమా విడుదలవుతున్న సందర్భంలో దర్శకుడు బాలు చిత్ర విశేషాలు మీడియాకు వెల్లడించారు.
* తొలి సినిమాగా ప్రేమనో, హారర్‌నో జోనర్ చేసుకుంటుంటారు. కాస్త భిన్నంగా, కొత్తగా చేయాలనిపించింది నాకు. అందుకే -నలుగురు హీరోయిన్లతో రెండుగంటలు నవ్వుకునే కథ చెప్పా.
* ఉద్యోగాలు చేసుకునే మెట్రో సిటీ గాళ్స్ నలుగురు ఫ్రెండ్ ఆహ్వానంపై గోవా వెళ్లి.. ఓ హత్య ఘటనలో ఇరుక్కుంటారు. భయంతో డెడ్‌బాడీని మాయం చేసి హైదరాబాద్ వచ్చేస్తారు. తరువాత వీరికి బ్లాక్‌మెయిలింగ్ మొదలవుతుంది. దాంతో మళ్లీ గోవావెళ్లి సమస్య పరిష్కరించుకోడానికి ఏం చేశారు? ఎలా బయటపడ్డారు? అన్నదే కథాంశం.
* ఇదొక రియలిస్టిక్ ఇన్సిడెంట్. మా ఫ్రెండ్స్ ఒకప్పుడు గోవాలా ఇలాగే ఇరుక్కున్నారు. ఆ సిట్యుయేషన్‌లో అమ్మాయిలుంటే ఏం చేస్తారు అన్నది దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాసుకున్నా.
* అడల్డ్ కంటెంట్ అన్న డౌట్స్‌ వున్నా, ఎక్కడా పరిధి దాటలేదు. రెండు మూడు పదాల విషయంలో సెన్సార్ ఇచ్చిన బీప్ తప్ప ఇంకేమీ ఉండదు.
* నలుగురు అమ్మాయిలు కూర్చుంటే ఎన్ని రోజులైనా కబుర్లు చెప్పుకోగలరు. వాళ్లేం మాట్లాడుకుంటారన్నది పెద్ద పజిల్. దానికి సమాధానానే్న కాస్త ఫన్‌గా సినిమాలో చెప్పా.
* సినిమా కోసం దాదాపు 50మంది హీరోయిన్లను పరిశీలించాం. అయితే ధన్య బాలకృష్ణను ఇన్నాళ్లూ సాఫ్ట్ క్యారెక్టర్‌లోనే చూశారు. ఆమెలోని మరో యాంగిల్‌ని కొత్తగా చూపించాలని ఆమెను తీసుకున్నాం.
* సినిమాలో సందేశమంటూ ఏమీ ఉండదు. లిమిట్స్ దాటి ఎంజాయ్ చేస్తే -అది అపాయానికి దారి తీయొచ్చు అన్న జాగ్రత్త మాత్రమే చెప్పాం.
* కామెడీ, క్రైమ్, సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నా. సరదా, భయం, భావోద్వేగాలతో సాగే నలుగురు అమ్మాయిల కథను ఎంజాయ్ చేయండి.
* నితిన్‌తో సినిమా ఉంటుందని అంతా అంటున్నారు. కానీ, అది నిజం కాదు. నితిన్ నాకు మంచి మిత్రుడంతే. ప్రస్తుతానికైతే నితిన్‌తో ఎలాంటి సినిమా లేదు. భవిష్యత్‌లో ఉంటుందేమో తెలీదు.