సినిమాగానూ.. మాకిదే ఫస్ట్‌టైం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్‌బాబు, సింధూర, కావ్యకీర్తి హీరో హీరోయిన్లుగా శ్రీవల్లిక ఫిలింస్ బ్యానర్‌పై దర్శకుడు ముస్కు రాంరెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం -నాకిదే ఫస్ట్‌టైం. నిర్మాత కురుపా విజయ్‌కుమార్ ముదిరాజ్ నిర్మిస్తోన్న చిత్రం ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ -ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది. తొలి సినిమాను తెరకెక్కిస్తోన్న దర్శక, నిర్మాత, టీంకి అభినందనలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ అధికారిక ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ -టైటిల్‌తోపాటు ట్రైలర్ యూత్‌కి కనెక్టయ్యేలా ఉంది. ఫస్ట్ ప్రాజెక్టు టీం మొత్తానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. సాయివెంకట్, తుమ్మలాపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ -విజయ్‌కుమార్ సినిమా నిర్మిస్తూ మంత్రి పాత్ర చేశారు. సినిమా సక్సెస్ సాధించాలి అని ఆకాంక్షించారు. హీరో ధనుష్‌బాబు మాట్లాడుతూ -టైటిల్‌లాగే నాకూ ఇది ఫస్ట్ టైం. దర్శక నిర్మాతల ప్రోత్సాహంతో సినిమా చేశా అన్నారు. దర్శకుడు రాంరెడ్డి మాట్లాడుతూ -టైటిల్‌లో క్యాచీనెస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్నో సందర్భాల్లో ఇదే ఫస్ట్ టైం అని ఉపయోగిస్తుంటాం. కథకు పర్ఫెక్ట్‌గా సరిపోయే టైటిల్ ఇది. మంచైనా, చెడైనా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే జీవితం సంతోషంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయంతో లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకోవద్దు అనేది చిత్రంలో చూపించనున్నాం. లవ్, రొమాన్స్, ఎమోషన్, కామెడీ.. ఇలా ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నారు. నిర్మాత విజయ్‌కుమార్ మాట్లాడుతూ -నేనూ గతంలో మీడియా ఫీల్డ్‌లో ఉన్నా. సినిమాలు, సీరియల్స్ చేశాను. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నా. దర్శకుడు రాంరెడ్డి ఏడాదిపాటు వెంటపడి సినిమా తీయించాడు. అతని సిన్సియారిటీ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చా. ధనుష్‌బాబు మంచి క్రికెటర్. ఈ సినిమాతో హీరో అవుతున్నాడు అన్నారు. ఈ చిత్రానికి చరణ్ అక్కల సినిమాటోగ్రఫీ, విజయ్ కురాకుల సంగీతం సమకూరుస్తున్నారు.