నేటివిటికీ తగ్గట్టుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత పరిస్థితుల్లో మన విద్యా విధానం ఎలా వుంది? చదువుకు తగినట్లు ఉద్యోగాలు దొరుకుతున్నాయా? అన్న కోణంలో ఈ చిత్రం సాగుతుంది. కన్నడంలో సూపర్‌హిట్ అయిన ‘కాలేజీ కుమార’ చిత్రాన్ని తెలుగులో అదే దర్శకుడు సంతు డైరెక్ట్ చేశారు. అయితే మన తెలుగు నేటివిటికీ తగిన విధంగా మార్పులు జరిగాయి అని తెలిపారు కధానాయకుడు రాహుల్ విజయ్. ఎం.ఆర్.పిక్చర్స్ పతాకంపై రాజేంద్రప్రసాద్, రాహుల్ విజయ్, మధుబాల ప్రధాన తారాగణంగా హరి సంతోష్ దర్శకత్వంలో ఎల్.పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు రాహుల్ విజయ్ చిత్ర విశేషాలు తెలిపారు.
* ప్రస్తుతం వున్న పరిస్థితులు సమాజంలో విద్యా వ్యవస్థకు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తోందీ, దానివల్ల విద్యార్థులు ఎంత గొప్పవాళ్ళు అవుతున్నారు, లేకపోతే విద్యావ్యవస్థను నిరసిస్తున్నారో అన్న అంశాలను తీసుకుని ఇప్పటి పరిస్థితులను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు వైవిధ్యంగా తీర్చిదిద్దాడు.
* కన్నడంలో కాలేజీ కుమార టైటిల్ క్యాచీగా అనిపించడంతో తెలుగులో కూడా అదే టైటిల్‌ను కాలేజీ కుమార్ అని నిర్ణయించారు. అక్కడ పెద్ద విజయాన్ని సాధించినట్టుగానే తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంటుందన్న నమ్మకం వుంది.
* ఈ సబ్జెక్ట్ నచ్చడంతో తెలుగులో చేయాలని నిర్ణయించుకుని బేసిక్ లైన్‌ను తీసుకుని తెలుగు వాతావరణానికి తగిన విధంగా తీర్చిదిద్ది ముఖ్యంగా తండ్రీకొడుకులమధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అయ్యేలా చేశాం.
* మధుబాల, నాజర్‌ల కాంబినేషన్‌లో రాజేంద్రప్రసాద్‌తో పనిచేయడం నాకెంతో సంతోషం అనిపించింది. వారి దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నా. షూటింగ్ అంతా సరదా సరదాగా గడిచింది. ట్రైలర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ లభించడంతో హిట్ అవుతుందన్న నమ్మకంతో వున్నాం.
* నటుడిగా నా వంతు కృషిని నేను చేస్తాను. ప్రతి సినిమా నుండి నేర్చుకునే ప్రయత్నంలోనే ఉంటా. అయితే హిట్, ఫ్లాప్ అనేది మన చేతిలో ఉండదు గదా!
* ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్‌తో వున్న ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం బ్లాక్ అండ్ వైట్ అనే థ్రిల్లర్‌లో నటిస్తున్నా. కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందిస్తున్నాడు. మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ఆ విషయాలు చెబుతాను.