కరోనా దెబ్బకు బాండ్ బెంబేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ కరోనా -జేమ్స్‌బాండ్‌నీ భయపెట్టింది. ప్రమాదాలకు ఎదురెళ్లే సాహసి సైతం -కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విషయమేంటంటే -ప్రపంచ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాండ్ సినిమా కరోనా దెబ్బతో ఏప్రిల్‌లో విడుదల కావడం లేదు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో రావాల్సిన తాజా చిత్రం -నో టైం టు డై. బ్రిటీష్ నటుడు డానియెల్ క్రెగ్ (కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలెస్, స్కై ఫాల్, స్పెక్టేటర్) చేస్తున్న ఐదో జేమ్స్‌బాండ్ సినిమా ఇది. నిజానికి ముందు ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం ఏప్రిల్ 8న నో టైం టు డై -ప్రపంచాన్ని ఉర్రూతలూగించాల్సి ఉంది. కొన్ని నెలల కిందటే ట్రైలర్ విడుదలై -థ్రిల్లింగ్ యాక్షన్, ఛేజింగ్ సీన్స్‌తో వావ్ అనిపించాడు డానియల్ క్రెగ్. పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రానున్న టైంలో -కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్ముకుంది. 70 దేశాలు ఈ వైరస్ బారినపడి అల్లాడిపోతున్నాయి. ఈ టైంలో సినిమాను విడుదల చేస్తే తీవ్ర నష్టాలు తప్పవన్న ముందుచూపుతో -నిర్మాతలు మైఖేల్ జి విల్సన్, బార్బరా బ్రొకొలి విడుదలను వాయిదా వేశారు. మెట్రో గోల్డ్ విన్ మేయర్ ఇయాన్ ప్రొడక్షన్స్‌పై క్యారీ జోజి ఫ్యోకునాగా తెరకెక్కించిన ఈ సినిమా బాండ్ సిరీస్‌లో 25వది. సో, -వచ్చే నవంబర్ 25న సినిమాను థియేటర్లకు తేవాలని నిర్ణయించారట. ఇదొక్కటే కాదు, మరిన్ని హాలీవుడ్ భారీ సినిమాలూ కరోనా వైరస్ దెబ్బకు విడుదల తేదీలు మార్చుకోడానికి సిద్ధమవ్వడం గమనార్హం.