వైవిధ్యమైన కథ.. మద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్, తిష్నా ముఖర్జీ జోడీగా శ్రీవిద్య దర్శకత్వంలో ఇందిరా బసవ నిర్మిస్తోన్న చిత్రం -మద. మార్చి 13న విడుదలవుతోన్న సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు హరీశ్ శంకర్, నటుడు నవదీప్ విడుదల చేశారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు, చిత్రయూనిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ -సాధారణంగా యంగ్ ఏజ్‌లో సినిమాలు చూస్తారు. కానీ, శ్రీవిద్య మాత్రం సినిమా తీసింది. ట్రైలర్ చూస్తున్నపుడు చాలా ఫ్యాషన్‌తో తీసిన సినిమా అనిపించింది. శ్రీవిద్యకు మంచి గుర్తింపు రావాలని, ఇప్పటికే ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఆనందకరం. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతోనే నేను, మహేశ్, నవదీప్ ముందుకొచ్చాం అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ -ఇదొక నెక్ట్స్ లెవెల్ మూవీ అని సినిమా చూశాక చెబుతున్నా. సినిమా చూసిన ఓ నిర్మాత -పెద్ద ప్రాజెక్టుగా చేయమని అడిగినా తన టీం కోసం ఆమె ఒప్పుకోలేదు. ఈ సినిమాకు మంచి సపోర్ట్ దొరుకుతున్నదుకు హ్యాపీగా ఉంది అన్నాడు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ -సినిమా రిలీజ్‌కు హరీశ్, నవదీప్ కారణం. దర్శకురాలు శ్రీవిద్య ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. 13న వస్తున్న సినిమాను ప్రోత్సహించండి అన్నారు.