ఘాటీ.. గొడవేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలీప్ రాథోడ్, పూనమ్ శర్మ జోడీగా రామ్‌థన్ మీడియా వర్క్స్ పతాకంపై వాల్మీకి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం -ఘాటి. తెలుగు, బంజారా భాషల్లో రూపొందించిన సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం ఉదయం ఫిల్మ్‌ఛాంబర్‌లో ప్రతాని రామకృష్ణగౌడ్, నిర్మాత గురురాజ్ విడుదల చేశారు. రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ -ట్రైలర్ దర్శకుడి ప్రతిభను తెలియజేస్తుంది. వినూత్నమైన కానె్సప్ట్‌తో రూపొందించిన చిత్రంలో కొత్త కంటెంట్ ఉంటుంది. ట్రైలర్‌లోనే ప్రతి ఫ్రేమ్ రిచ్‌నెస్‌గా చూపించాడు. వాల్మీకి ఓ కొత్త నేపథ్యాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఇటీవల బంజారా భాషల్లో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. హీరో దిలీప్ రాథోడ్ మాట్లాడుతూ -షూటింగ్ సగానిపైగా పూరె్తైంది. కొత్తవాళ్లు, ప్రతిభ వున్నవాళ్లు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారన్నారు. దర్శకుడు వాల్మీకి మాట్లాడుతూ -మూడో సినిమాగా నేను రూపొందించిన సినిమా రాజస్థాన్‌లో ఘాటి ప్రాంతంలో జరిగిన కథ. మార్వాడీలతో జరిగిన గొడవతో బంజారాలు ఘాటి పల్లెను వదిలేయాల్సి వస్తుంది. నిజంగానే ఊరిని వదిలేశారా? లేక తిరిగి ఘాటికే చేరుకున్నారా? అన్నదే కథాంశం. లవ్, ఎమోషన్, యాక్షన్ అంశాలతో సినిమా రూపొందించామన్నారు. కార్యక్రమంలో అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ తదితరులు విశేషాలు వెల్లడించారు.