దటీజ్.. నాని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇచ్చిన మాట ప్రకారం వివేక్ ఆత్రేయకు -నాని ఓ చాన్స్ ఇస్తున్నాడట. కొత్తవాళ్లను తనదైన స్టయిల్‌లో ప్రోత్సహిస్తున్న నాని -మొన్నటి హిట్ దర్శకుడు శైలేష్ కొలనుకూ అలాగే చాన్స్ ఇచ్చాడు. ‘మెంటల్ మదిలో..’ సినిమా తెరకెక్కిస్తోన్న టైంలో కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ -నానిని కలిసి ఓ లైన్ చెప్పాడట. నానికి కంటెంట్ నచ్చినా -సినిమాను తీయగల స్టామినా వివేక్‌కు ఉందో లేదోనన్న చిన్న సందేహం వెలిబుచ్చాడట. ఓకే అనిపించుకున్నాకే -మళ్లీ నానిని కలుద్దామన్న ఉద్దేశంతో వివేక్ ఆగిపోయాడు. అలా ‘మెంటల్ మదిలో..’ సినిమా ఫరవాలేదనిపించుకుంది. సెకెండ్ చాన్స్ ‘బ్రోచేవారెవరురా’ తో హిట్టందుకున్నాడు వివేక్ ఆత్రేయ. దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటే చాన్స్ ఇస్తానని అప్పుడిచ్చిన మాటను ఇప్పుడు నాని నిలబెట్టుకుంటున్నాడు. నానికి చెప్పిన లైన్‌ను అలాగే ఉంచేసిన వివేక్ -ఆ కథనే ఇప్పుడు బయటకు తీస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోలంతా స్టార్ డైరెక్టర్లతో బిజీగా ఉంటున్నారు. ఒక ప్రాజెక్టు లైన్‌లో ఉండగానే -తరువాతి ప్రాజెక్టుల కోసం స్టార్ డైరెక్టర్లను లాక్ చేసుకుంటున్నారు. కొత్త దర్శకులతో ప్రయోగాలు చేసేంత తీరిక స్టార్లకు ఎలాగూ లేదు కనుక -వాళ్లకు నాని ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తోన్న వివేక్ ఆత్రేయ -నాని సారథ్యంలో చేయబోయే కథ ఏ జోనర్‌లో ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది.